ఆంధ్రప్రదేశ్‌

వజ్రకరూర్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, మార్చి 27: అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడొకరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గొర్రెపిల్లను దొంగిలించాడన్న నెపంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న విడపనకల్లుకు చెందిన వల్లేష్ (32) ఆదివారం రాత్రి మృతి చెందాడు. వల్లేష్ స్టేషన్ నుంచి తప్పించుకుపోయి ఉరేసుకున్నట్లు పోలీసులు అంటున్నారు. కాగా పోలీసులు కొట్టిన దెబ్బలకే వల్లేష్ చనిపోయాడని, దానిని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు సోమవారం స్టేషన్‌పై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. వల్లేష్ వజ్రకరూరు మండలం ధర్మంపురి గ్రామంలో మిరపపంట కోతకు కూలీగా వచ్చాడు. అదే గ్రామానికి చెందిన గిరిబాబు, వీరేష్‌లు తమ గొర్రె పిల్లను దొంగలించారని ఊరివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వల్లేష్, గిరిబాబు, వీరేష్‌లను పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. కాగా సోమవారం ఉదయం వల్లేష్ స్టేషన్ వెనుకభాగంలో ఉన్న చెట్లమధ్య ఉరి వేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు తరలివచ్చి ఆందోళనకు దిగారు. స్టేషన్‌పై రాళ్లురువ్వి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన గుంతకల్లు డిఎస్పీ రవికుమార్ ఆందోళనకారులను శాంతింపజేశారు. స్టేషన్‌లో ఉన్న ముగ్గురు నిందితులు తప్పించుకున్నారని, వల్లేష్ స్టేషన్ వెనక భాగంలో చెట్టుకు వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని డిఎస్పీ వివరించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

చిత్రం..అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న
మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు