ఆంధ్రప్రదేశ్‌

‘ఆరెంజ్’తో సంబంధం నిరూపిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 27: ఆరెంజ్ ట్రావెల్స్‌తో తనకు సంబంధం ఉందని నిరూపించకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా అని వైఎస్‌ఆర్ సిపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఎక్కడ ఏం జరిగినా తనకు ముడిపెడతారా? ఇంత దారుణంగా అబద్దాలు చెబుతారా అని నిలదీశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ సభ జరుగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అక్రమంగా నిర్బంధించారు.. ఆయనను అరెస్ట్ చేసి ఇంకా విడుదల చేయలేదు. దీనిపై అడగడానికి ప్రయత్నిస్తే సభలో స్పీకర్ మైక్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడికి సంబంధించి అడిగితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా.. చట్టం తన పని తాను చేయకుండా బాబు అడ్డుతగలడం భావ్యమేనా అని ప్రశ్నించారు. టిడిపి నాయకులు రవాణాశాఖ కమిషనర్ గన్‌మెన్‌ను గట్టిగా తోసేశారని, వాళ్లకు క్షమాపణలు చెప్పరా అని ప్రశ్నించారు. ఒక ప్రైవేట్ వ్యవహారం కోసం టిడిపి నేతలు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారని, ప్రజాహితం కోసం వెళ్లలేదన్నారు. టిడిపి నేతలు దౌర్జన్యం చేస్తే, ముఖ్యమంత్రి సెటిల్‌మెంట్ చేసి అధికారులను నిస్సహాయ స్థితికి నెట్టడం సరైనదేనా అని జగన్
నిలదీశారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి విషయంలో చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెనుకేసుకొచ్చి రాజీ చేశారని గుర్తుచేశారు. ‘వీళ్ల మనుషులు తప్పు చేస్తే రాజీలు, సెటిల్‌మెంట్లు చేస్తారు.. టిడిపి నేతల దౌర్జన్యంపై ప్రశ్నించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని బయటకు కూడా కనిపించనీయడం లేదు.. చెవిరెడ్డి విషయంలో స్పీకర్ ఎందుకు పట్టించుకోవడం లేదు.. సభాపరంగా రక్షణ ఉన్న ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేశారని జగన్ నిలదీశారు. ఆర్‌టిసి కమిషనర్‌కు క్షమాపణ చెప్పిన టిడిపి ప్రజాప్రతినిధులు గన్‌మెన్‌కు ఎందుకు క్షమాపణ చెప్పలేదు.. అంటే వారి దృష్టిలో కానిస్టేబుళ్లు మనుషులు కారా.. అని ప్రశ్నించారు. మీరు కూడా వ్యవస్థలను రక్షించేందుకు ప్రయత్నించాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యేపై అన్యాయంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. రేపు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయవచ్చు. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పది. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అధికారంలో ఉన్నవారిని సమర్థించకూడదు అని జర్నలిస్టుల నుద్దేశించి వ్యాఖ్యానించారు. వ్యవస్థను స్వయంగా ముఖ్యమంత్రి చెడగొడుతుండటం దారుణం అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామని, అయినా ఏమవుతుంది.. గతంలో మాదిరిగానే బుల్డోజ్ చేస్తారు అని వ్యాఖ్యానించారు.