ఆంధ్రప్రదేశ్‌

చెవిరెడ్డికి విష్ణు మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: అసెంబ్లీ గేటు బయట నిరసన వ్యక్తం చేస్తున్న వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బిజెపి శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు నుంచి ఊహించని మద్దతు లభించింది. విష్ణుకుమార్ కారు దిగి వెళ్తూ నిరసన వ్యక్తం చేస్తున్న చెవిరెడ్డిని చూసి ఆగారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తప్పు చేసింది ఎవరైనా శిక్షించాలని, అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులతో అధికారులు మర్యాదపూర్వకంగా ఉండాలని కోరారు. ఎంపి, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పడం కొంత నయమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.
పోలీసులపై వైసిపి
హక్కుల ఉల్లంఘన నోటీస్
గుంటూరు జిల్లా మంగళగిరి డిఎస్పీ రామాంజనేయులు, సిఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐ బాలకృష్ణలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్సార్సీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించగా పరామర్శించేందుకు వెళ్లిన తమ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించారని వివరించారు. తమను మంగళగిరి పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నదీ వారు జర్నలిస్టుల సమక్షంలో జగన్‌కు వివరించారు.
అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ధర్నా