ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీల్లో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: పనె్నండు రోజుల విరామం అనంతరం ట్రెజరీల్లో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు మోక్షం లభించింది. ఈనెల 16వ తేదీ నుంచి ట్రెజరీల్లో అన్ని రకాల బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు, హాస్టల్, జైళ్లు, ప్రభుత్వాసుపత్రులు, అంగన్‌వాడీలలో ‘డైట్’ బిల్లులు సైతం నిలిచిపోయాయి. దీంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపుకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక్క నయాపైసా కూడా వృథా పోరాదనే సంకల్పంతో మధ్యాహ్న భోజనం, వ్యవసాయరంగానికి సంబంధించిన సబ్సిడీలు, పలు రకాల నష్టపరిహారాలకు సంబంధించి కేవలం 789 పద్దు కింద ఉన్న బిల్లులన్నింటినీ సోమవారం ఉదయం నుంచి బ్యాంక్‌లకు పంపించడం ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మాత్రం సచివాలయంలో రాత్రి పగలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తూ వివిధ పద్దుల కింద రావాల్సిన పన్నులు, రాబడిని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం ఉగాది సెలవు ఆ తర్వాత చివరి రెండు రోజుల్లో అన్ని రకాల బిల్లులను ఆమోదింపచేసేలా కసరత్తు జరుగుతున్నది.