ఆంధ్రప్రదేశ్‌

శాంతి లేదు.. భద్రతా లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 27: విజయవాడ నగరంలో రవాణా శాఖ కమిషనర్, సీనియర్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు 200 మంది టిడిపి గూండాలతో చుట్టుముట్టి చేసిన దౌర్జన్యాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఎపిసిసి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార మదం నెత్తికెక్కిన టిడిపి ఎంపి, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. కొద్దిరోజుల క్రితం రెవెన్యూ అధికారి వనజాక్షి పై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసిన ఘటనలో ఆయన కేసు లేదు.. ఆ ఎమ్మెల్యేపై కేసు లేకుండా చంద్రబాబు పంచాయితీ చేశారు. టిడిపి ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు రవాణాశాఖ అధికారిపై దౌర్జన్యం చేసి గన్‌మెన్‌పై చేయిచేసుకొంటే చట్టప్రకారం వారిపై కేసు పెట్టాల్సిన ప్రభుత్వం, చంద్రబాబు జోక్యం చేసుకుని పంచాయితీ చేసి వారిచేత క్షమాపణలు చెప్పించారన్నారు. క్షమాపణలు కాదు, ఎంపి, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని అమలుచేయాల్సిన మీరే పంచాయితీలు చేస్తుంటే .. మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు మీకు, పదవికి రాజీనామా చేసి పంచాయితీలు చేసుకోండి, ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించి గూండాగిరీ వృత్తి చేసుకోమనండని వ్యాఖ్యానించారు. విజయవాడ లోనే కాదు రాష్టమ్రంతా తెలుగుదేశం గూండాల పాలన సాగిస్తోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అవినీతి రాజ్యం నడుస్తోందని పేర్కొన్నారు. రెండు ఆవుల కుమ్ములాటలో లేగడూడకు కాళ్ళు విరిగినట్టు చంద్రబాబు అహంకారం, జగన్ మూర్ఘత్వంతో ప్రజల సమస్యలు గాలికి కొట్టుకుపోయాని ఆవేదన వ్యక్తం చేశారు.