ఆంధ్రప్రదేశ్‌

ఉగాదికి కరవు దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 27: కరవు పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉగాది పండుగ కళ తప్పింది. దుర్భిక్షం కారణంగా జిల్లా నుంచి లక్షలాది మంది గ్రామీణులు వలస పోయారు. గ్రామాల్లో ఉన్న వారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా సొమ్ము చేతికందక పోవడంతో నామమాత్రంగా పండుగ జరుపుకునే పరిస్థితి నెలకొంది. ఈనెలలో తీసుకున్న రేషన్ సరుకులతో అనేక మంది పేదలు సరిపెట్టుకుంటుండగా, మరికొంతమంది ఎంతోకొంత అప్పు చేస్తున్నారు. జిల్లా నుంచి బెంగళూరు, చెన్నై, కోచ్చి, హైదరాబాద్, బళ్లారి, హోస్పేట్ తదితర ప్రాంతాలకు దాదాపు 8 లక్షల మంది వలస వెళ్లారని అంచనా.
ఈ నేపథ్యంలో నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు కొందరు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నా, ఇంకా సగం మంది సొంతూళ్లకు చేరుకోవడం లేదు. వలస వెళ్లిన ప్రదేశాలు దూరంగా ఉండటం, రానూపోనూ ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో ఒకట్రెండు రోజులకు ఎందుకు రావాలని కుటుంబాలతో సహా వెళ్లిన వారు భావించి అక్కడే ఉండిపోతున్నట్లు సమాచారం. కుటుంబ యజమానులు, భార్యాభర్తలు మాత్రమే తిరిగి వచ్చి వృద్ధులైన తల్లిదండ్రులు, పిల్లాపాపలతో గడిపేందుకు తిరిగొస్తున్నారు. జిల్లాలోని కదిరి, నల్లమాడ, తలుపుల, నంబులపూలకుంట, తనకల్లు, వెంగళమ్మచెరువు, హిందూపురం, పెనుకొండ, మడకశిర, రొద్దం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ తదితర నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో వలస వెళ్లిన విషయం విదితమే. కాగా వలసదారుల్ని వెనక్కు రప్పించి సొంతూళ్లలో వారికి అడిగినన్ని ఉపాధి హామీ పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా, సరైన ప్రణాళిక లేకపోవడంతో వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రక్రియ కంటితుడుపు చర్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో పండుగ నామమాత్రంగా జరుపుకుంటున్నారు. అనంతపురం నగరంలోని రాణీనగర్, తదితర ప్రాంతాల నుంచి కూడా కోచ్చికి వలసలు వెళ్లిన వారున్నారు. వారిలో కొందరే తిరిగొచ్చినట్లు తెలుస్తోంది.