ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైల మల్లన్నకు కైలాస వాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మార్చి 27: శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల్లో భాగంగా రెండవరోజు సోమవారం మల్లన్న స్వామి కైలాస వాహనంపై విహరించారు. భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్ల భాగంగా తెల్లవారుజామునుంచే స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వర పూజ, మండపారాధనలు, జపానుష్టానాలు జరిపించారు. యాగశాలలో రుద్రహోమం, చండీహోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన కైలాస వాహనంపై ఆశీనులను జేసి పూజలు చేశారు. మహామంగళహారతి అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. గ్రామోత్సవం ముందు కళాకారులు ప్రదర్శించిన జానపదకళలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు అలరించాయి.