ఆంధ్రప్రదేశ్‌

మా గది చూస్తే సిగ్గేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 28: ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు వస్తే వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తోందని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బిజెఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని, బిజెపికి మరీ ఇంత చిన్న రూమా అంటూ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెఎల్పీ రూమ్ చూస్తే తనది చేతగానితనం అనే భావన, ఢిల్లీ పెద్దలకు కలుగుతుందని, అందుకే వారిని పిలవడం లేదన్నారు. బాత్‌రూమ్ లేదని మంత్రులను అడిగితే తమదీ అదే పరిస్థితి అన్నారని చెప్పారు. ఆరుగురు మంత్రులకు ఒకే బాత్‌రూమ్ కేటాయించడం దారుణమని వ్యాఖ్యానించారు. స్కూళ్లు, కాలేజీలు కట్టినట్టు అసెంబ్లీని కట్టారన్నారు.