ఆంధ్రప్రదేశ్‌

ధర్మనిధి ప్రసంగానికి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 28: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ పేరిట ‘్ధర్మనిధి ప్రసంగం’ ఏర్పాటుకు మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చొరవ తీసుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ద్వారా ధర్మనిధి ప్రసంగం జరిగేందుకు అవసరమైన రూ. 6 లక్షల నిధిని ఎయు విశ్రాంత ఆచార్యులు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మంగళవారం అందజేశారు. ఏయూ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి నుంచి , సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన జాస్తి చలమేశ్వర్ ధర్మనిధి ప్రసంగం ఏర్పాటు చేయడం ద్వారా ఒక విశిష్ఠ వ్యక్తిని గౌరవించుకునే అవకాశం దక్కిందని ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ విధంగా కన్నతల్లి, మాతృభూమి, విద్య నేర్పి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన వర్సిటీ రుణం తీర్చుకుంటున్నామన్నారు. ధర్మనిధి ప్రసంగాలకు నిధులను అందించాలని నిర్ణయించి ఆ దిశగా పనిచేస్తున్నామన్నారు. ఇటువంటి విశిష్ట ప్రసంగాలు తన చిన్నతనంలో ఎంతో ప్రేరణ కలిగించాయన్నారు. రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, అస్సాం రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన జాస్తి చలమేశ్వర్ పేరుతో ప్రతీ ఏడాది ఏయూ న్యాయ కళాశాలలో విశిష్ట వ్యక్తులతో ప్రత్యేక ప్రసంగం ఏర్పాటు చేస్తారన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నిరంతరం నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యక్రమాల్లో ఇవి భాగమన్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు మాసాల కాలంలో నాలుగు ధర్మనిధి ప్రసంగాలకు రూ.24 లక్షలు వర్సిటీకి అందించారన్నారు. తెలుగు, జర్నలిజం, హిందీ, న్యాయ కళాశాలలో వీటిని నిర్వహిస్తామన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో మరికొన్ని ధర్మనిధి ప్రసంగాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే వర్సిటీ 12 స్మారక, ధర్మనిధి ప్రసంగాలు ఏర్పాటు చేసామన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ధర్మనిధి ప్రసంగాలు ఏర్పాటు చేయడానికి ఆచార్య యార్లగ్డ లక్ష్మీప్రసాద్ చూపుతున్న చొరవ, కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య ఎన్. బాబయ్య, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డి.సూర్యప్రకాశరావు, జాస్తి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఏయు వీసి నాగేశ్వరరావుకు ధర్మనిధిని అందిస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్