ఆంధ్రప్రదేశ్‌

భీమిలి ఆనందవనంలో సద్గురు శివానంద విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, మార్చి 29: విశాఖ జిల్లా భీమిలి ఆనందవనం ఆశ్రమంలోని యోగ మహాగణపతి ఆలయంలో సద్గురు శివానందమూర్తి విగ్రహాన్ని ఆయన కుమారుడు బసవరాజు దంపతులు ఉగాది పర్వదినాన నెలకొల్పి సద్గురువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు సద్గురు శివానంద మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదవితరణ చేశారు. ఈ సంధర్బంగా సద్గురు కుమారుడు బసవరాజు మట్లాడుతూ ప్రసాంతతకు మారుపేరైన వేద భూమి అయిన భారతావనిలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారంటే గరువుల ఆశీర్వాదం, సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడమే కారణమన్నారు. ఆశ్రమ నిర్వాహకులు రాఘవేంధ్రరావు, అర్చకులు మనోహర్, డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, డాక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఆనందవనం ఆశ్రమం యోగ గణపతి ఆలయంలో
సద్గురు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం