ఆంధ్రప్రదేశ్‌

సింహాచలేశునిపై బిబిసి డాక్యుమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 29: శ్రీమహావిష్ణువు వరాహ, నారసింహ అవతారాల కలయికలో విలక్షణ మూర్తిగా ఆవిర్భవించిన మహా పుణ్యక్షేత్రం సింహాచలం. దేశంలో నారసింహ క్షేత్రాలు, వరాహ క్షేత్రాలు అనేకం ఉన్నా వరాహ నారసింహ అవతారాలు కలిసి ద్వాయావతారంలో వెలసిన విశిష్ఠ రూపుడు సింహాచలేశుడు. ప్రపంచంలో మరెక్కడా కానరాని ఈ అరుదైన నారసింహుడి అవతార క్షేత్ర విశిష్ఠతలపై డాక్యుమెంటరీ చిత్రీకరించేందుకు ప్రముఖ బిబిసి చానల్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన బుధవారం దేవాలయంలో జరిగిన పందిరిరాట ఉత్సవాన్ని చిత్రీకరించారు. దేవాలయంపై కొలువుతీరివున్న శిల్పాలను, ఏకశిలా స్తంభాలను తమ వద్ద ఉన్న అరుదైన కెమెరాలతో చిత్రీకరించారు. ఆలయ విశిష్టతలు, ఉత్సవాలు, భక్తుల సదుపాయాలను కూడా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పిస్తుండగా చిత్రీకరించనున్నారు.