ఆంధ్రప్రదేశ్‌

మొగల్తూరు ఘటనపై విపక్షాలు సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో విష వాయువు వెలువడి ఐదుగురు మృతి చెందిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. ఒకపక్క తుందుర్రులో ఏర్పాటు చేస్తున్న ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా అనేక రోజుల నుంచి ఉద్యమిస్తున్న తరుణంలో మరో పక్క అదే యాజమన్యానికి చెందిన ఆక్వా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరగటంపై ప్రతిపక్షాలు సీరియస్‌గా ఉన్నాయి. ఈ ప్రమాదంపై పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి స్పందిస్తూ ఆక్వా కార్మికుల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని, మృతులకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన పోరాడుతుందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ మృతులకు నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా చికిత్స పొందుతున్న వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలనన్నారు. అలాగే మొగల్తూరు ఆక్వా పరిశ్రమను తక్షణమే మూసివేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేసారు. మొగల్తూరు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వేర్వేరు ప్రకటనలలో డిమాండ్ చేసారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలను నష్టపరిహారంగా అందజేయాలని డిమాండ్ చేసారు. ఆక్వా ప్రమాదంపై ఉన్నత న్యాయ విచారణ జరపాలని సిపిఐయు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ డిమాండ్ చేసారు.