ఆంధ్రప్రదేశ్‌

కలసికట్టుగా పనిచేస్తే సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: కార్యకర్తలు కలసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు దక్కుతాయనే దానికి మాధవ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడమే నిదర్శనమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పివిఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మాణిక్యాలరావు మాట్లాడుతూ భాజపా కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయడం వల్ల మాధవ్ గెలుపు సాధ్యమైందన్నారు. భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ మాధవ్ విజయం కోసం పట్టుదలతో పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు మాధవ్‌ను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జమ్ముల శ్యాంకిషోర్, ఎన్.సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.