ఆంధ్రప్రదేశ్‌

16 బిల్లులకు శాసనమండలి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 16 బిల్లులకు ఆమోదం తెలిపింది. శాసనమండలిలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ (సవరణ) బిల్లు-2017, ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డు బిల్లు-2017, ఏపి ఎనర్జీ యూనివర్సిటీ బిల్లు-2017, ఏపి మెరిటైమ్ బోర్డు బిల్లు-2017, ఏపీ లాజిస్టిక్ యూనివర్సిటీ బిల్లు-2017, ది ఆంధ్రప్రదేశ్ (ఎష్యూరెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫర్నీషింగ్ ఆఫ్ కంబైన్డ్ రిటర్న్స్ అండర్ వెరియస్ లేబర్ లాస్ బై సర్టైన్ ఎస్టాబ్లిష్‌మెంట్స్) (సవరణ) బిల్లు-2017 బిల్లులు ఆమోదం పొందాయి. డెప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన ది రిజిస్ట్రేషన్ బిల్లు-2016 (ఏపీ సవరణ) బిల్లు, ది రైట్ టు ఫెయిర్ కాంపెనే్సషన్ అండ్ ట్రాన్స్‌పారెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్, రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్‌మెంట్ (ఆంధ్రప్రదేశ్ ఎమెండ్‌మెంట్) బిల్లు 2017, ది ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (ఆప్ డేషన్ ఇన్ రీ సెటిల్‌మెంట్ రిజిష్టర్) బిల్లు-2017కు ఆమోదం లభించాయి. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సభలో ప్రవేశపెట్టిన ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ఎమెండ్‌మెంట్) బిల్లు-2016, డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టీకల్చరల్ యూనివర్సిటీ (ఎమెండ్‌మెంట్) బిల్లు-2016, ది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ అండ్ ఒషియన్ యూనివర్సిటీ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) బిల్లు 2017లకు సభ ఆమోదం తెలిపింది. బిసి సంక్షేమ, సాధికారిత మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టిన ది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ (ఎమెండ్‌మెంట్) బిల్లు-2016కు, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ (ఎమెండ్‌మెంట్) బిల్లు-2017కు సభ ఆమోదించింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ సభలో ప్రవేశపెట్టిన ది డెంటిస్ట్ (ఆంధ్రప్రదేశ్ ఎమెండ్‌మెంట్) బిల్లు-2017కు సభ ఆమోదం తెలిపింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సభలో ప్రవేశపెట్టిన ది ఆంధ్రప్రదేశ్ కోర్ డిజిటల్ ఆథారిటీ (ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ ఇ-సర్వీసెస్) బిల్లు-2017కు సభ ఆమోదం తెలిపింది. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంబంధిత శాఖా మంత్రులు వారి శాఖలకు చెందిన బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆమోదం పొందిన 16 బిల్లులను గురువారం శాసనమండలి ఆమోదించింది.