ఆంధ్రప్రదేశ్‌

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 30: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండరామస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగనున్నాయి. రెండుసార్లు నిర్వహించిన ఉత్సవాల్లో జరిగిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గత వారం రోజులుగా ఒంటిమిట్టలో పలు పనులు చేపడుతున్నారు.
ఏప్రిల్ 2వ తేదీ నాటికి పనులన్నీ పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను టిటిడి ఇంజనీరింగ్ విభాగం ఆదేశించింది. ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసే లక్షలాది మంది భక్తాదులను దృష్టిలో ఉంచుకుని కల్యాణ ప్రాంగణం, ఆలయ ప్రాంగణం, స్వామివారు విహరించే పురవీధులు, మాడావీధులను అందంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 4వ తేదీ అంకురార్పరణతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 4న వ్యాసాభిషేకం, 5న ధ్వజారోహణం, శ్రీరామనవమి, పోతన జయంతి, రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. 6న స్వామివారికి వేణుగాన అలంకారం, రాత్రి హంసవాహన సేవ, 7న వటపత్రసాయి అలంకారం, రాత్రి సింహవాహన సేవ, 8న నవనీతకృష్ణ అలంకారం, రాత్రి హనుమవాహన సేవ, 9న మోహినీసేవ, రాత్రి గరుడ వాహన సేవ, 10వ తేదీ శివధనుర్భాలంకారం ఉంటాయి. పున్నమి రాత్రి వెలుగులో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం గజవాహన సేవ ఉంటాయి. 11వ తేదీ ఉదయం రథోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. 12న కాళీయ మర్ధన అలంకారం, రాత్రి అశ్వవాహన సేవ, 13న చక్రస్నానం, 14న ధ్వజావరోహణం, పుష్పయాగం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.