ఆంధ్రప్రదేశ్‌

‘టెన్త్’లో మాల్ ప్రాక్టీసే లేదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 30: స్కూల్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (ఎస్‌ఎస్‌సి) కొత్త అధ్యాయానికి తెరతీసిందా? లేదా టెన్త్ విద్యార్థుల్లో ఊహించని మార్పు వచ్చిందా? లేక టెన్త్ పరీక్షలను స్వ్కాడ్‌లు చూసీ చూడనట్టు వదిలేశాయా? పరీక్షా కేందాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలకు భయపడి విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదా? ఇవేవీ కాకుండా టెన్త్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించమని సిఎం ఆదేశించడంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠ్యాంశాలను ఔపోసన పట్టించారా? ఇన్ని అనుమానాలకు కారణం ఒకటే! గురువారంతో ముగిసిన టెన్త్ పరీక్షల్లో డీబార్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. ఈ ఏడాది నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో రాష్టవ్య్రాప్తంగా 48 నుంచి 50 మంది విద్యార్థులు మాత్రమే డీబార్ అయినట్టు విద్యాశాఖ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తెలిసింది. ఇందులో ఉత్తరాంధ్రలో కేవలం ఆరుగురు మాత్రమే డీబార్ కావడం మరింత విచిత్రంగా ఉంది. పరీక్షల్లో డీబార్ కావాలన్న నిబంధన ఏమీ లేదు! కానీ మాస్ కాపీయింగ్‌కు కేరాఫ్ అడ్రసైన విశాఖ ఏజెన్సీలో కూడా ఈ ఏడాది ఒక్క మాల్‌ప్రాక్టీస్ కూడా జరగలేదంటే ఆశ్ఛర్యపోవలసిందే. 2014-15లో విశాఖ జిల్లాలో 37 మంది డీబార్ అయ్యారు. 2015-16లో తొమ్మిది మంది డీబార్ అయ్యారు. ఈఏడాది అయితే నిల్.
టెన్త్ పరీక్షల్లో ఆశ్రమ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుంటాయి. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే నాన్ వెజ్ ఇవ్వకుండా దానికి ఖర్చు చేసే డబ్బుతో పరీక్షల నిర్వహణ సిబ్బందిని మేనేజ్ చేస్తుంటారన్న ఆరోపణలు లేకపోలేదు. పరీక్షా కేంద్రాల తనిఖీకి వెళ్లే స్క్వాడ్‌లపై స్థానికులు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే ఆశ్రమ పాఠశాలలను కొద్ది నెలల కిందట విశాఖ ఐటిడిఏ ప్రాజెక్ట్ డైరక్టర్ తనిఖీ చేస్తే, అందులో చాలా మంది చదవడం, రాయడం కూడా రాదన్న విషయాన్ని తెలుసుకుని ఆశ్ఛర్యపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధనపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో ఈ సంవత్సరం పరీక్షలు గొప్ప బందోబస్త్‌గా జరిగినట్టు చెప్పుకోడానికి ఒక్క మాల్ ప్రాక్టీస్ కూడా లేకపోవడమే. జిల్లావ్యాప్తంగా 13 స్క్వాడ్‌లు పనిచేశాయి. వీరితోపాటు ఉన్నతాధికారులు కూడా ఆకస్మిక తనఖీలు చేశారు. ప్రతి రోజు ఈ తనిఖీ బృందాలు 80 పరీక్షా కేంద్రాలను పరిశీలించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి సమాచారం. జిల్లా వ్యాప్తంగా 238 పరీక్షా కేంద్రాల్లో 57,518 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఎన్ని స్క్వాడ్‌లు ఉన్నా, సిసి కెమేరాలు ఉన్నా కొన్ని చోట్ల చూసీ చూడనట్టు వదిలేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సిసి కెమెరాలకు భయపడి..
ఇదిలా ఉండగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్‌ను తగ్గించడానికే ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి భయపడి కాపీయింగ్‌కు పాల్పడలేదని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలియచేశారు. అలాగే, ఈ సంవత్సరం ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉంది. ప్రశ్నను నేరుగా కాకండా విభిన్నంగా అడిగినందువలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారని ఆమె వివరించారు. అయితే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇటువంటి ప్రశ్నలను ఏవిధంగా అర్థం చేసుకోవాలో సూచించాం. కానీ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రశ్నలను చాలా వరకూ అర్థం చేసుకోలేకపోయారని ఆమె వివరించారు.