ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిలో నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 21: అభివృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2015-16 సంవత్సరానికి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 10.9 శాతం అభివృద్ధి రేటు సాధించడంతో, డబుల్ డిజిట్ సాధించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కల సాకారం అయ్యిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తుండటాన్ని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని, ప్రభుత్వం తప్పుడు లెక్కలతో అభివృద్ధి చూపిస్తోందని జగన్ ఆరోపించడం అందుకు నిదర్శనమన్నారు. అభివృద్ధి శాతం ఎక్కువగా చూపించి, అప్పులు చేశారన్న తప్పుడు ప్రచారాన్ని కూడా జగన్ ప్రారంభించారని, ఇది పూర్తిగా అతని అవగాహన లేమికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 14వ ఆర్ధిక సంఘం చేసిన సూచనల మేరకు 3 శాతం నిధులను అప్పు తెచ్చుకునే అవకాశం ఉన్నదని, ఆ విధంగా రూ.17వేల కోట్లు అప్పుగా తెచ్చినట్టు యనమల పేర్కొన్నారు. అభివృద్ధి రేటు విషయంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు అనుసరిస్తోన్న మెథడాలజీనే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది తప్ప కొత్తగా అనుసరించినదేమీ లేదన్నారు.
చీలిక దిశగా జగన్ పార్టీ!
ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీలిక దిశగా పయనిస్తోందని, భవిష్యత్తులో ఆ పార్టీ ఎమ్మెల్యేలే జగన్‌పై అవిశ్వాసం పెట్టి, పదవి నుండి దించేయడం తథ్యమని యనమల వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆ పార్టీని వీడి, తమ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోందని, త్వరలో సగానికి సగం సభ్యులు ఖాళీ కావడం తథ్యమన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య 2/3కు కూడా పడిపోవచ్చని, అటువంటి పరిస్థితుల్లో జగన్‌పై అవిశ్వాసం పెట్టి ఉన్న పదవుల్లో నుండి దించివేసే దుస్థితిని ఎదుర్కొనక తప్పదని అన్నారు. మరోవైపు జగన్ చుట్టూ కేసుల ఉచ్చు కూడా బిగుసుకుంటోందని, భవిష్యత్‌లో వైసిపి ఉండదని జోస్యం చెప్పారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చే అంశం, భవిష్యత్తు ముఖ్యమంత్రి అంశాలపై స్పందించేందుకు యనమల విముఖత వ్యక్తంచేశారు. లోకేష్‌కు మంత్రి పదవిని ఇవ్వాల్సిందిగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్‌పై అభిప్రాయం ఏమిటి? అన్న విలేఖరుల ప్రశ్నకుసమాధానం ఇవ్వకుండా దాటవేశారు. లోకేష్‌ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా మీ సహచర మంత్రులు పేర్కొంటున్నారు కదా? అన్న ప్రశ్నకు ‘ఈ విషయాలు అప్రస్తుతం’ అంటూ దాటవేశారు. లోకేష్‌ను మీరు భవిష్యత్ ముఖ్యమంత్రిగా చూస్తారా? అన్న ప్రశ్నకు ‘నువ్వయినా ముఖ్యమంత్రి అయిపోవచ్చు’ అంటూ ప్రశ్న అడిగిన విలేఖరిపై యనమల ఛలోక్తి విసిరారు.