ఆంధ్రప్రదేశ్‌

లోకేష్.. ఎమ్మెల్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 30: ఇప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకే పరిమితమై, తెరవెనుక చక్రం తిప్పుతూ వస్తోన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, గురువారం నుంచి శాసనమండలి సభ్యుడిగా పెద్దల జాబితాలో చేరారు. మండలి సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన లోకేష్‌తోపాటు, ప్రకాశం జిల్లా సీనియర్ నేత కరణం బలరామ్‌ను స్వాగతిస్తూ గుంటూరు, విజయవాడ, వెలగపూడిలో భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కరణం వర్గీయులైతే ఐదారువేల మంది ప్రకాశం జిల్లా నుంచి భారీ కాన్వాయ్‌తో వచ్చి, అసెంబ్లీ బయట కొద్దిదూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో, బహిరంగసభ నిర్వహించడం ద్వారా తన సత్తా చాటారు. కాగా, ఉదయం ప్రమాణానికి స్వీకారోత్సవానికి హాజరయ్యే ముందు తాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించేందుకు మొదటి మెట్టు ఎక్కబోగా అక్కడ కాలుజారి బోర్లా పడబోగా, పక్కనే ఉన్న నేతలు ఆయన భుజాలు పట్టుకుని ఆపారు. తర్వాత తాత విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత మండలి చైర్మన్ చక్రపాణి చాంబర్‌లో ప్రమాణం చేసిన సందర్భంలో తెలుగు సరిగా చదవలేక అవస్థలు పడాల్సి వచ్చింది. సార్వభౌమాధికారాన్ని బదులు, ‘సార్వభౌమ్.. అధికారాన్ని’, శ్రద్ధాశక్తులతో నిర్వర్విస్తాను అనే పదం పలికేందుకు చాలా ఇబ్బంది పడి, చివరకు దాన్ని శ్రద్ధ.. శ్రద్ధా అని సగంలోనే వదిలేశారు. ఈవిధంగా చిన్న చిన్న పదాలను ఉచ్ఛరించడంలో చినబాబు అనేకసార్లు తడబడాల్సి వచ్చింది. దీనిపై బయటకొచ్చిన ఒక సీనియర్ నేత వద్ద మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించగా, కానె్వంటు చదువులు కదా.. వదిలేయండి అని సరదా వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన లోకేష్‌ను ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆ తర్వాత తండ్రి చంద్రబాబునాయుడు కూడా తనయుడిని అభినందించారు. మంత్రి యనమల, అచ్చెన్నాయుడు, శిద్దారాఘవరావు, దేవినేని ఉమ, బుచ్చయ్యచౌదరి, పార్టీ కార్యాలయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ టిడి జనార్దన్‌రావు, కొత్త ఎమ్మెల్సీలు కరణం బలరామ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంతెన సత్యనారాయణరాజు, తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ నేతలు కరణం వెంకటేష్, దేవతోటి నాగరాజు, తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయ ఇన్చార్జి అమర్‌నాధ్‌బాబు తదితరులు అభినందించారు. ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత, తొలిసారిగా టిడిఎల్పీ కార్యాలయానికి రాగా ఇన్చార్జి కోనేరు సురేష్ చినబాబుకు స్వాగతం పలికారు. అక్కడ ఆయన కాఫీ తాగి, అక్కడికి వచ్చిన వారితో ముచ్చటించారు.