ఆంధ్రప్రదేశ్‌

నిరవధికంగా అసెంబ్లీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 31: రాష్ట్ర శాసనసభ నిరవధికంగా శుక్రవారం వాయిదా పడింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై చివరిరోజు వాడి వేడి చర్చ జరిగింది. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ప్రతిపక్ష వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. రాష్ట్ర శాసనమండలి కూడా పాఠశాల విద్యపై స్వల్పకాల చర్చ అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 57 గంటల 56 నిమిషాలు జరిగాయి. 14 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులు ఆమోదం పొందాయి. ఇక పార్టీల వారీగా సభలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారనేదానికి వస్తే.. టిడిపి ఎమ్మెల్యేలు 42 గంటల 9 నిమిషాలు, వైఎస్‌ఆర్‌సిపి 12 గంటలు, బిజెపి 3 గంటల 32 నిమిషాలు మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 8 గంటల 19 నిమిషాలు మాట్లాడగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 3 గంటల 46 నిమిషాలు మాట్లాడారు. అలాగే బిజెఎల్పీ నేత 3 గంటల 13 నిమిషాలు మాట్లాడారు. కాగా అసెంబ్లీ జరిగిన తీరుపై వైఎస్‌ఆర్ సిపి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎంకు 8 గంటలు అవకాశం ఇస్తే, వైఎస్ జగన్‌కు ఇచ్చిన సమయం కేవలం మూడు గంటలా అని ప్రశ్నించారు. శాసన మండలి కూడా 14 రోజుల పాటు సమావేశమై 51.50 గంటల పాటు చర్చించింది. 228 ప్రశ్నలు రాగా, 21 బిల్లులపై చర్చించారు.