ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో ఆశావహులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 31: మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కొందరు...ఉన్న పదవి కొనసాగించాలని మరి కొందరు... నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు, మండలి డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రమణ్యానికి అభినందనలు తెలిపేందుకు మరికొందరు....ఇలా అందిరితో కలసి అసెంబ్లీ ప్రాంగణం శుక్రవారం కోలాహలంగా కనిపించింది. ఏపి రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలో అసెంబ్లీకి పెద్ద ఎత్తున ఆశావాహులు చేరుకోవడంతో ప్రాంగణం కిక్కిరిసి కోలాహలంగా మారింది. బృందాల వారిగా నేతలు వారి అనుచరులు, కుటుంబసభ్యులతో సిఎం చంద్రబాబును, లోకేష్‌ను కలిసి విజ్ఞప్తులు చేశారు. ఇటు అధికారులు కూడా నూతనంగా మంత్రులను కేబినేట్‌లోకి తీసుకుంటే వారికి ఎక్కడ ఛాంబర్లను కేటాయించాలనే అలోచనతో ఛాంబర్ల అనే్వషణలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి సమయంతో పాటు సందర్భం కూడా ఖరారైన నేపథ్యంలో ఎవరు ఇన్, ఎవరు ఆవుట్ అనే చర్చ సర్వత్రా శుక్రవారం లాబీల్లో కనిపించింది. మధ్యాహ్న భోజనం హోం మంత్రి చినరాజప్ప ఛాంబర్‌లో చేసిన లోకేష్ తనను కలిసిన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన ఛాంబర్‌లో బొజ్జల గోపాలకృష్ణ, పశ్చిమ గోదావిర జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాయలసీమకు చెందిన చాంద్‌పాషా కలిశారు. అలాగే తనకు మండలి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పేందుకు తూర్పు గోదావరి జిల్లా నేతలతో కలిసి వచ్చిన రెడ్డి సుబ్రమణ్యంతో కాసేపు సిఎం భేటీ అయ్యారు. అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గాన్ని కూర్పుచేయనున్నట్లు చెప్పిన సిఎం రానున్నది ఎన్నికల క్యాబినేట్‌గా అభివర్ణించారు. అవకాశం లభించినా లభించకపోయినా ప్రజాసేవలో తెదేపా నేతలు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండాలని నేతలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ శుక్రవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పీకర్ కోడెల శివప్రసాద్ భారీ నజరాగా సుమారు 80వేల రూపాయల విలువ చేసే శామ్‌సంగ్ గిఫ్ట్‌కూపన్లను బహుమతిగా అందించారు. వీటిని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుకొన్నారు. అసెంబ్లీ ప్రారంభం రోజు సభ నిర్వహించిన ప్రదేశంలోనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి సాధారణ పరిపాలనశాఖకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9.25 నిముషాలకు గవర్నర్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలిసింది.