ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశంలో ‘తలసాని’ తలనొప్పి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 31: మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తీసివేతలు, కూడికలతో కసరత్తు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి నైతిక అంశం సంకటంగా మారింది. తెలంగాణ రాష్ట్రం సనత్‌నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్, తర్వాత తెరాసలో చేరి మంత్రిగా ప్రమాణం చేశారు. దానికంటే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను స్పీకర్‌కు అందించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో విమర్శలు కురిపించిన తెలుగుదేశం పార్టీ, గవర్నర్ చర్యను తీవ్రంగా ఆక్షేపించింది. గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని నెరవేర్చకుండా, ప్రభుత్వం చెప్పిన మాట విన్నారంటూ ధ్వజమెత్తింది. వేరే పార్టీ ఎమ్మెల్యేతో ఏవిధంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారని నిలదీసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చివరకు చంద్రబాబునాయుడు కూడా తలసాని చర్య అనైతికమని, మనం టికెట్టిస్తే గెలిచిన తలసానికి టీఆర్‌ఎస్ మంత్రి పదవి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ టిడిపి నేతలు ఇప్పటికీ తలసాని వ్యవహారాన్ని అనైతికమంటూ తప్పుపడుతూనే ఉన్నారు.
తాజాగా ఏప్రిల్ 2న ఏపిలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోన్న తెలుగుదేశం ప్రభుత్వానికి, సరిగ్గా ఇలాంటి నైతిక సంకటమే ఎదురవుతోంది. 21మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే తెదేపాలో చేరారు. అందులో భూమా అఖిలప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవులు ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వారిని మంత్రి మండలిలోకి తీసుకుంటే విపక్షాలు, ప్రజల నుంచి నైతిక విలువలకు సంబంధించి వచ్చే విమర్శలు, చర్చల గురించి తెదేపా నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు తాము తెలంగాణలో తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రి ఇవ్వడాన్ని అనైతిక చర్యగా గవర్నర్‌ను విమర్శించి, ఇప్పుడు ఏపీలో తామూ అదే పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారన్న నైతిక సంకటంలో పడింది. ఒకవైపు నైతిక విలువల గురించి మాట్లాడుతూ, మరోవైపు తామూ అదే అనైతిక చర్యలకు పాల్పడితే తటస్థులు, విద్యావంతుల్లో చంద్రబాబునాయుడు ఇమేజ్ దెబ్బతింటుందన్న ఆందోళన మరోవైపు పట్టిపీడిస్తోంది.
ఇదిలాఉండగా, ఈ నైతిక సంకటం నుంచి రాజ్యాంగపరమైన రక్షణ పొందాలంటే, తాము కూడా తెలంగాణలో తెరాస పాటించిన విధానానే్న అనుసరించక తప్పదన్న భావన నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఆ ప్రకారంగా.. మంత్రిమండలిలో తీసుకునే వైసీపీ ఎమ్మెల్యేలతో స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇప్పించి, దానిని సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టించడం ద్వారా గండం నుంచి గట్టెక్కాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని ఏపి అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వద్ద ఇష్టాగోష్ఠిగా ప్రస్తావించినప్పుడు ‘అప్పుడు మేం వద్దన్నా గవర్నర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడా అదే జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.