ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో సబ్-రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ.పోలవరం, మార్చి 31: తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం సబ్-రిజిస్ట్రార్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలలో చిక్కారు. ఆస్తి పంపకం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి సంబంధిత దస్తావేజులు ఇవ్వడానికి రూ.13 వేలు లంచం తీసుకుంటున్న అతడిని ఎసిబి అధికార్లు వలపన్ని పట్టుకున్నారు. రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం టి కొత్తపల్లి గ్రామానికి చెందిన మట్టా ఏసుబాబు కుటుంబానికి చెందిన మూడు ఎకరాల 10 సెంట్ల భూమి పార్టిషన్ డీడ్‌ను మార్చి 27న రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనికి సంబందించిన డాక్యుమెంట్లు తీసుకోవడానికి వెళ్లినన ఏసుబాబును భూమి విలువలో మూడు శాతం అంటే రూ.24 వేలు లంచంగా ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ఎ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అయితే తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని చెప్పడంతో మద్యవర్తుల ద్వారా రూ.13 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడానికి ఇష్టంలేని ఏసుబాబు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు ఏసుబాబు శుక్రవారం రూ.13వేలు నగదు సబ్-రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు కార్యాలయంలో అందించారు. అదే సమయంలో తాము దాడిచేసి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డిఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నామని, అతడిని విజయవాడ ఎసిబి కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈ దాడిలో ఎసిబి ఏలూరు ఇన్‌స్పెక్టర్ విల్సన్, ఎస్‌ఐ నరేష్ పాల్గొన్నారు.