ఆంధ్రప్రదేశ్‌

అస్తమించిన కళా భాస్కరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 1, కళా భాస్కరుడు ఆస్తమించాడు. నాటకాలే ఊపిరిగా జీవనయానం సాగిం చి కళామతల్లి ముద్దు బిడ్డగా, నాటక రంగానికి పెద్ద దిక్కుగా కీర్తిగడించిన కొత్తూర్తి భాస్కరరావు(86) అనారోగ్యంతో ప్రహ్లాదపురంలోని తన నివాసంలో శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. భాస్కరావు మరణ వార్త వినగానే నాటరంగం శోకసంద్రంలో మునిగిపోయింది. మూడు వందలకు పైగా నాటకాలలో నటించి మరెన్నో నాటకాలకు దర్శకత్వం వహించి వెయ్యిమందికి పైగా శిష్యులను కళా రంగానికి అందించిన భాస్కరరావు 1930 జూన్ 14న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామంలో అన్నపూర్ణ, స్వామి దంపతులకు జన్మించారు. ఆంధ్రాయూనివర్సిటీ నుం డి బిఎ డిగ్రీ, నాటకరంగం లో డిప్లమో చేసారు. రైల్వేలో ఆఫీ స్ సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా నాటక రంగానికి ఎనలేని సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థల ద్వారా వందకు పైగా ఉత్తమ నటుడు, దర్శకుడు అవార్డులను అందుకున్నారు.

కొత్తూర్తి భాస్కర రావు(ఫైల్)