ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు రూ.5.08కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 1: కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరాములవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఇందుకోసం రూ. తిరుమల తిరుపతి దేవస్థానం రూ.5.08 కోట్లు కేటాయించిందని టిటి డి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం ఒంటిమిట్ట వచ్చిన ఆయన రాములవారి ఆలయం, యాత్రికుల వసతి సముదాయం, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను కలెక్టర్ కెవి.సత్యనారాయణ, ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, టిటిడి జెఇఓ పోలా భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు అం దజేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం వల్ల ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది, జిల్లా పోలీ సు యంత్రాంగంతో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారన్నారు. టిటిడి ఆరోగ్య విభాగం అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మెరుగైన పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని సూచించారు. వెయ్యి మందికి పైగా శ్రీవారి సేవకులు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందిస్తారన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణలు, స్వాగత తోరణాలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఇతర చానల్స్‌కు ఫీడ్ అందివ్వాలని సిఇఓను ఆదేశించారు. టిటిడికి సహకరించి ఒంటిమిట్టలో జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఇఓ సాంబశివరావు కోరారు. ఒంటిమిట్టలో ఇప్పటి వరకు రూ.13.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. టిటిడి జెఇఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 5న శ్రీరామనవమి, బమ్మెర పోతన జయంతి, ధ్వజారోహణం ఉంటాయన్నారు.
8వ తేదీ హనుమంత సేవ, 9న గరుడ వాహనసేవ, 10న స్వామివారి కల్యాణం, 11న రధోత్సవం జరుగుతాయన్నారు. ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు.