ఆంధ్రప్రదేశ్‌

అమ్మానాన్న గుర్తుకు రావడంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తు న్న సమయంలో అమ్మా నాన్న గుర్తుకు రావడంతో గొంతు తడబడిందని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. ఆ సమయంలో ఉద్వేగానికి గురయ్యానన్నారు. పుట్టినరోజు నాడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని సిఎంవో నుంచి ఫోన్ వచ్చినప్పుడు అమ్మా నాన్నల ఫొటోల వద్దకు వెళ్లి ఏడ్చానన్నారు. అమ్మ చనిపోవడంతో ఎమ్మెల్యేను అయ్యానని, తండ్రి చనిపోవడంతో మంత్రిని కావాల్సి వచ్చిందన్నారు. ఈవిషయం తలచుకుంటే బాధకలుగుతోందంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో తానే పిన్నవయస్కురాలినని, అందరి సలహాలు తీసుకుంటానని తెలిపారు.