ఆంధ్రప్రదేశ్‌

ఇది రాజ్యాంగ ఉల్లంఘనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 2: ఈ రాష్ట్రంలో మంత్రి కావాలనుకుంటే ప్రతిపక్షంలో ఉంటే చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టిడిపి అధినేత చంద్రబాబేనని విమర్శించారు. నోట్ల కట్టలతో కొనుగోలు చేసిన వారిని మంత్రులను చేసిన ఘన త టిడిపికే దక్కుతుందని మండిపడ్డారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలస వెళ్లిన వారితో రాజీనామా చేయించి పార్టీలోకి ఆహ్వానించాలనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. తాను నిప్పునని, నీతి నిజాయితీకి నిలువుటద్దమని చెప్పుకునే చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని రాం బాబు ధ్వజమెత్తారు.