రాష్ట్రీయం

హైదరాబాద్ ఎంపీ సీటే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: గత ఎన్నికల్లో విఫలమైన అన్ని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లోని ప్రజలకు పార్టీ భావాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారిలో సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు బిజెపి దేశవ్యాప్తంగా సామాజిక సమరసత కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 120 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీ కార్యకర్తల సదస్సులను నిర్వహిస్తారు. ప్రతి సదస్సుకు కేంద్ర మంత్రి లేదా జాతీయ స్థాయి నాయకులను పంపించి పార్టీ ఇటీవల సాధించిన ఘన విజయాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు. యుపిలో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో గెలవగా లేనిది తెలంగాణలో ఎందుకు గెలవలేమనే భావనతో పార్టీ ఈసదస్సులకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం పాత్రికేయులకు వివరించారు. హైదరాబాద్ ఎంపి స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని భాజపా విస్తృతస్థాయి సమావేశంలో అమిత్‌షా కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో బిజెపి పట్ల సానుకూల వాతావరణం నెలకొందని చెప్పారు. పూర్తికాలం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామని ఈ నెల 7వ తేదీన అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో సైతం బిజెపి గెలిచిందని, అదే రీతిన హైదరాబాద్‌లోనూ సాధ్యమవుతుందని, అందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపిని తీర్చిదిద్దుతున్నామన్నారు. నితిన్ గడ్కారీ నిజామాబాద్ పార్లమెంటు సదస్సుకు, అనంతకుమార్ మహబూబ్‌నగర్ సదస్సుకు, భువనగిరి సదస్సుకు ప్రకాష్ జవదేకర్ హాజరవుతారని పేర్కొన్నారు. పొన్ను రాధాకృష్ణ వరంగల్ పార్లమెంటు సదస్సుకు వస్తారని, కె హరిబాబు మెదక్ పార్లమెంటు సదస్సుకు హాజరవుతారని, మల్కాజ్‌గిరి సదస్సుకు మురళీధరరావు వస్తారని, సికింద్రాబాద్ పార్లమెంటుకు దత్తాత్రేయ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు.