ఆంధ్రప్రదేశ్‌

మిర్చి ధరపై కేబినెట్‌లో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 3: రాష్ట్రంలో మిర్చికి కనీస ధర కల్పించే విషయమై ఈ సారి జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ సోమవారం ఆర్ అండ్ బి అతిధిగృహంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతు ప్రతినిధులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గత కొద్దిరోజులుగా మిర్చి ధర పతనమవుతున్న నేపథ్యంలో రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ రైతుసంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి పుల్లారావు స్పందిస్తూ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించే విషయమై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని కనీస మద్దతుధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ధరల్లో వ్యత్యాసంపై ఇప్పటికే వ్యాపారులు, రైతు ప్రతినిధులతో చర్చిస్తున్నామని, ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డులో మచ్చుకాయలను పూర్తిగా నియంత్రించామన్నారు. రెండుశాతం కంటే ఎక్కువ కమీషన్ తీసుకునే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు గోతానికి 16 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, నిర్దేశించిన విధంగా 35 రూపాయలు చెల్లించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. కోల్డుస్టోరేజీలు అదనంగా పెంచిన పది రూపాయల ధరను తగ్గించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి రైతులు దిక్కుతోచని స్థితిలో అప్పుల ఊబిలో కూరుకుపోయారని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల జీవనానికి ప్రభుత్వం భరోసా కల్పించకపోతే ఆత్మహత్యల బాట పడుతున్నారని ఈ విషయంలో మొండి వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. మిర్చికి కనీస ధర 8 నుంచి 9 వేలు కల్పించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపించాలని డిమాండ్ చేశారు. మిర్చి యార్డులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కోల్డుస్టోరేజీల యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరిపి పెంచిన ధరలను తగ్గించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. సమావేశంలో రైతుసంఘం నాయుకులు మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.