ఆంధ్రప్రదేశ్‌

ఐదోరోజూ తిరగని లారీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: అపరిష్కృత డిమాండ్ల సాధనకై దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యజమానులు చేపట్టిన నిరవధిక బంద్ సోమవారం ఐదో రోజుకు చేరింది. డిమాండ్లలో ప్రధానమైన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంపై బీమా క్రమబద్ధీకరణ అభివృద్ధి సంస్థ ‘ఐఆర్‌డిఎ’ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రీమియం రేటుని ఒకేసారి 50 శాతం పెంచడాన్ని లారీ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రీమియం తగ్గింపునకు అధికారులు ఇష్టపడలేదు. తాజాగా రూ.28,800లుగా ఉన్న ప్రీమియం రేటు ఒకేసారి 44వేల 500 రూపాయలకు చేరింది. సోమవారం నాటి చర్చల్లో సంఘం దక్షిణాది రాష్ట్రాల చైర్మన్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆర్.గోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి షణ్ముగం, ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అపరిష్కృత డిమాండ్ల సాధనకై జాతీయస్థాయిలో ఈనెల 26వ తేదీ నుంచి లారీల నిరవధిక బంద్ చేపట్టాలని ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ తొలుత నిర్ణయించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల సంఘం నేతల విజ్ఞప్తిని పురస్కరించుకుని జాతీయస్థాయిలో ఈనెల 8వ తేదీ నుంచే నిరవధిక బంద్ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో అప్పటివరకు బంద్ కొనసాగించాలని నిర్ణయించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ఆంధ్రభూమికి తెలిపారు.