ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు మోకాలడ్డిన వైసిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 4: ‘నేను మంత్రిని కాకముందే నాకున్న పరిచయాలతో రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నించా. కానీ అప్పుడు వైఎస్సార్‌సీపీ వాటిని అడ్డుకుంది. ఇప్పుడు మంత్రిగా అధికారికంగానే నాకున్న పరిచయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తా’నని గ్రామీణాభివృద్ధి, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అవినీతి చేసే వాళ్లు భయపడాలి. నా మీద 420 కేసులు లేవని పరోక్షంగా జగన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి తన శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన, సచివాలయంలో కొద్దిసేపు మీడియాతో తొలిసారి చిట్‌చాట్ చేశారు.
నాకు చాంబర్ పెద్దగా ఉండాలనేమీ లేదని, తనకు పనిలో తండ్రి చంద్రబాబుతోనే పోటీ అని వ్యాఖ్యానించారు. తాను ముందునుంచే పెట్టుబడుల కోసం తన పరిచయాలు ఉపయోగించి వాటిని తీసుకువద్దామనుకున్నానని, అయితే అప్పట్లో వైసీపీ దానికి అడ్డుపడిందని ఆరోపించారు. గ్రామీణ మంచినీటి సరఫరా అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాత్రికి రాత్రికి తాగునీరు సమస్యను పరిష్కరించలేం కదా? దానికి దీర్ఘకాలిక, స్పల్పకాలిక లక్ష్యాలున్నాయి అన్నారు. గ్రామాల్లో తాగునీటి వసతికే నా తొలి ప్రాధాన్యం. అయ్యన్నపాత్రుడు గత రెండేళ్లలో బాగా మార్పులు తీసుకువచ్చారు. నాకు కీలకమైన శాఖలిచ్చారు. ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తా అన్నారు.
తనయుడిని మంత్రిగారూ అన్న సీఎం
గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా లోకేష్ అనేక వింత అనుభవాలు, అనుభూతికి లోనయ్యారు. రోజూ కలసి ఉండే తండ్రి, సీఎం హోదాలో తనను ‘మంత్రిగారూ’ అని సంబోధించడం లోకేష్‌ను కొత్త అనుభూతికి గురిచేసింది. ‘సమస్యలన్నీ పరిష్కరించే దిశగా అధికారులతో సమన్వయం చేసుకోండి మంత్రిగారూ’ అని మిగిలిన మంత్రులను సంబోధించినట్లుగానే తనయుడిని పిలవడం అధికారులనూ ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా సీఎం చెబుతున్న వివరాలన్నీ శ్రద్ధగా ఆలకిస్తూ విద్యార్థి మాదిరిగా నోట్‌బుక్‌లో లోకేష్ నోట్ చేసుకోవడం మరో విశేషం. అదే సమయంలో ఉపాధి హామీ పనుల్లో వస్తున్న ఇబ్బందులను జడ్పీ చైర్మన్లు ప్రస్తావించడం కూడా కొత్త అనుభవం కలిగించింది.
చాంబర్‌ను పరిశీలించిన లోకేష్
రాష్ట్ర ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తనకు వెలగపూడి సచివాలయంలో కేటాయించిన బ్లాక్-2లోని చాంబర్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ నెల 7 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.