ఆంధ్రప్రదేశ్‌

చరిత్ర తిరగేస్తే చిట్టా తెలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 4: ఫిరాయింపుపై మాట్లాడే నైతిక అర్హత వైసిపి అధినేత జగన్‌కు లేదని సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తన తండ్రి ఏ పార్టీలో చేరి ఏ పార్టీలో మంత్రి అయ్యారో ఓసారి తెలుసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కాల్వ వైసిపి అధ్యక్షుడికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘‘వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో రెడ్డి కాంగ్రెస్ తరఫున పులివెందుల అసెంబ్లీకి ఎన్నికై, రాజీనామా చేయకుండా ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరిన రోజు ‘మొదటి బ్లాక్‌డే’ అనేది జగన్ తెలుసుకోవాలి. అంజయ్య మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా (1980-82) చేరిన రోజు (11.10.1980) బ్లాక్ డే కాదా? భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేరిన రోజు (24.02.1982) బ్లాక్‌డే కాదా? , కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా చేరిన రోజు (19.9.1982 బ్లాక్‌డే కాదా? మీ నాయన అయితే రాజీనామా చేయకుండా మూడుసార్లు మంత్రి కావచ్చునా? వేరేవాళ్లు కాకూడదా? మీ నాయనకైతే ఒక రూలు, అఖిలప్రియకు, ఆదినారాయణ రెడ్డికి, అమరనాథ రెడ్డికి మరో రూలా?’’ అని ప్రశ్నించారు.
‘‘మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి 12 మంది ఇతర పార్టీల ఎంపిలను క్రాస్ ఓటింగ్ చేయించిన రోజు రెండవ బ్లాక్‌డే (22.07.2008). ఆ రోజు టిడిపి ఎంపిలు మందా జగన్నాధం, ఆదికేశవులు నాయుడుచే ఇదే రాజశేఖర రెడ్డి లోక్‌సభ గ్యాలరీలో ఉండి క్రాస్ ఓటింగ్ పర్యవేక్షించిన చరిత్ర ఉంది. టిఆర్‌ఎస్‌ను చీల్చి 9 మంది శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసిన చరిత్ర రాజశేఖర రెడ్డిది. ఇది ఫిరాయింపు కాదు, పొలిటికల్ కన్సాలిడేషన్, అభివృద్ధికి సంఘీభావం అని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణలో తలసాని తదితరులకు మంత్రి పదవులిచ్చినప్పుడు వ్యతిరేకించి ఇక్కడెలా తీసుకుంటారనే ప్రశ్న కరెక్ట్ కాదు. తలసాని దగ్గర బల్బు ఎలా వెలిగిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ స్విచ్ నొక్కితే తలసాని దగ్గర బల్బ్ వెలిగింది? జగన్ స్విచ్ నొక్కితే తలసాని దగ్గర బల్బు వెలుగుతుంది. అది అందరికీ తెలిసిందే. అక్కడది ఫిరాయింపు, ఇక్కడిది పొలిటికల్ కన్సాలిడేషన్. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంకు అడ్డుపడుతున్న జగన్ తీరు నచ్చకే వైకాపా నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బైటకు వచ్చారన్నారు. ‘‘స్పీకర్ నిర్ణయం వచ్చే వరకు ఆగాల్సిందే. ఒక వేళ అప్పటిదాకా ఆగలేమంటారా, మీ 40 మంది రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి తేలిపోతుందన్నారు. రేపో మాపో ఎంపిలందరితో రాజీనామా చేయించి ప్రత్యేక హోదాపై ఎన్నికలకు వెళ్తామన్నారు కదా చూద్దాం వాటిల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.