ఆంధ్రప్రదేశ్‌

ఆలయాల్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రంలోని ఆలయాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం విధించారు. ప్రసాదాల కవర్లపై దేవుడి చిత్రాల ముద్రణను నిషేధిస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదం కోసం వినియోగించే ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపరు కవర్లను వినియోగించాలని ఆదేశించారు. ప్రసాదాలకు సంబంధించిన కవర్లపై దేవుడి చిత్రాలను ముద్రించవద్దని ఆదేశించారు. పర్యావరణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు స్వచ్ఛ దేవాలయ మిషన్‌ను ప్రారంభించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు.