ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ఫిరాయింపులపై జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 4: పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అనైతిక రాజ్యాంగ చర్యలు నిరోధించేందుకు భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తక్షణమే జోక్యం చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి కోరారు.
ఆ మేరకు మంగళవారం రాష్టప్రతికి ఒక లేఖ రాశారు. గత కొద్ది నెలలుగా సిఎం చంద్రబాబునాయుడు తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాస్తూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలో చేర్చుకున్నారన్నారు. వారు అప్పటి నుంచి తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో పార్టీ ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేలకు నలుగురికి స్థానం కల్పించడం ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకమన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాల్సిన రాష్ట్ర గవర్నర్, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలుచేయాల్సిన శాసన సభాపతి (స్పీకర్) వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో ఈవిషయాన్ని రాష్టప్రతి దృష్టికి తీసుకొస్తున్నట్టు రఘువీరారెడ్డి వివరించారు. ఈవిషయంలో తక్షణమే జోక్యం చేసుకొని రాజ్యాంగ విలువలను కాపాడాలని ఎపిసిసి తరఫున కోరుతున్నట్టు తెలిపారు.