ఆంధ్రప్రదేశ్‌

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, ఏప్రిల్ 4: తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణ శివారు ఇసుకలపేట సమీపంలో మంగళవారం ఉదయం బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడగా, వారితో ఇద్దరి పరిస్థితి విషమంగావుంది. బాణాసంచా తయారీ సందర్భంగా నిప్పురవ్వలు ఎగసిపడటంతో ప్రమాదం సంభవించింది. వివరాలిలావున్నాయి... ఇసుకలపేట సమీపంలో చెల్లుబోయిన రమణ అనే వ్యక్తి చాలాకాలంగా రేకుల షెడ్డులో లైసెన్సుడు బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం యథావిథిగా బాణాసంచా తయారుచేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి, అక్కడవున్న మందుగుండులో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడే పనిచేస్తున్న గెడ్డమూరి దుర్గ, సాపిరెడ్డి ముసలయ్య, ఆరుగుల రమేష్‌కు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. గాయపడిన వారికి తునిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో దుర్గ, ముసలయ్య పరిస్థితి విషమంగావుంది. సంఘటన స్థలాన్ని పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావు, డిఎస్పీ రాజశేఖర్ సందర్శించి ప్రమాదంపై ఆరాతీశారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, తుని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌న్ పోల్నాటి శేషగిరిరావు, మున్సిపల్ ఛైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ పరామర్శించారు. కాగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పరామర్శించారు.