ఆంధ్రప్రదేశ్‌

‘దేశం’లో పురంధ్రీశ్వరి ‘లేఖ’ కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 4: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మిత్రపక్షమైన బిజెపి నుంచి కూడా అలాంటి వ్యతిరేకతే ఎదురుకావడంతో నైతిక సంకటంలో పడింది. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన 21మంది ఎమ్మెల్యేలలో నలుగురికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి పదవులివ్వడాన్ని తప్పుపడుతూ బిజెపి జాతీయ నాయకురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖ తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తోంది. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మంత్రి పదవులివ్వడాన్ని ఆమె తన లేఖలో తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదని, రెండు తెలుగురాష్ట్రాల్లో ఫిరాయింపుచట్టం అపహాస్యం పాలవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని, ఫిరాయించిన వారికి మంత్రి పదవులివ్వడం అప్రజాస్వామికమని తన లేఖలో పేర్కొన్నారు.
కాగా, పురంధ్రీశ్వరి రాసిన లేఖ అటు రాష్ట్ర బిజెపిలోనూ కలవరం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మానసిక మద్దతుదారులుగా వ్యవహరిస్తోన్న ఒక వర్గానికి పురంధ్రీశ్వరి లేఖ మింగుడు పడటం లేదు. ఆమె లేఖపై ఆ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ‘్ఫరాయింపుల అంశంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. క్యాబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటివరకూ స్పందించలేదు. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. అయితే, ఆయనకు తెలుగుదేశం నాయకత్వంతో ఉన్న మొహమాటాల వల్ల ఏమీ మాట్లాడటం లేదు. మేం మాట్లాడితే మాపై తెలుగుదేశం వ్యతిరేక ముద్ర వేస్తారు. అందువల్ల మేమూ మాట్లాడటం లేదు. ఇప్పటికే కన్నా, పురంధ్రీశ్వరి, సోమువీర్రాజుపై ఈ ముద్ర వేశారు. కన్నా, పురంధ్రీశ్వరి వైసీపీకి వెళ్లిపోతారని ఓ వర్గం చాలాకాలం నుంచీ ప్రచారం చేస్తున్న విషయం మీకూ తెలుసు. ఆమె లేఖ రాసినా దానిని మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖండించే పరిస్థితి గానీ, నిరోధించే శక్తిగానీ లేదు. కాకపోతే ఆ అంశంపై మా రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడాల్సి ఉంది. ఏదేమైనా మేడమ్ మాట్లాడిన దాంట్లో అబద్ధమేముంది? మేం ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి రేపు ఫిరాయింపులపై మీ అభిప్రాయమేమిటని మీ మీడియావాళ్లు అడిగితే ఏం చెబుతాం? స్వాగతించలేం కదా’ అని ఓ సీనియర్ బిజెపి నేత వ్యాఖ్యానించారు.
అటు తెలుగుదేశం కూడా రాజకీయంగా సంకటస్థితిలో పడింది. ఇప్పటివరకూ కేవలం వైసీపీ మాత్రమే ఫిరాయింపు అంశంపై జనంలోకి వెళుతోంది. తాజాగా గవర్నర్‌ను కలిసిన వైసీపీ, త్వరలో ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల నాయకులను, జాతీయ మీడియాను కలిసి ఫిరాయింపు అంశం, వారికి మంత్రిపదవులు ఇవ్వడంపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మిత్రపక్షమైన బిజెపికి చెందిన పురంధ్రీశ్వరి అదే అంశంపై ప్రధానికి, పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడం ఇబ్బందికరంగానే భావిస్తోంది. పురంధ్రీశ్వరి లేఖపై స్పందించిన సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమె లేఖ అంశాన్ని బిజెపి అధిష్ఠానం చూసుకుంటుందని జవాబిచ్చారు. ‘ఆమె ఏనాడైనా జగన్ అక్రమాలు ప్రశ్నించారా? మా పార్టీకి సంఖ్యాబలం లేక వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న జగన్ వ్యాఖ్యలతో విబేధించి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.