ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ రికార్డు వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక నుంచి ఇంటిగ్రేటెడ్ హెల్త్ రికార్డు సిస్టమ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి సంబంధించిన హెల్త్ రికార్డు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా మళ్లీ ఆసుపత్రికి వచ్చినవారి పూర్వ వ్యాధుల చరిత్ర పరిశీలించి మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆరోగ్యశాఖ ప్రవేశపెట్టిన పథకాలపై అధ్యయనం చేసేందుకు నాలెడ్జ్-సర్వీస్ పార్టనర్స్‌ను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతిలో సోమవారం రాత్రి జరిగిన ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. నీరు, ఆహారం, వాతావరణం, వంశ పారంపర్యంగా వచ్చే ఇతర సమస్యలే కాకుండా ఒక్కోసారి ఆలోచనా విధానాలు సైతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇలాంటి వాటిని గుర్తించి వ్యాధుల బారినపడ్డ వారికి తగిన వైద్యం అందించడమే కాకుండా ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని ముఖ్యమంత్రి వైద్యశాఖ అధికారులకు నిర్దేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సూచిలో మనం ఎక్కడ ఉన్నామో ప్రతి మూడు, ఆరు మాసాలకోసారి సమీక్షించుకుని ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. అందుకోసం సమర్ధమైన ఒక వ్యవస్థను నెలకొల్పుకోవాలని చెప్పారు.
ఉద్ధానం సమస్యపై
అధ్యయనానికి ప్రత్యేక సంస్థ
ఉద్ధానం కిడ్నీ వ్యాధి బాధితుల కోసం మొబైల్ టీములతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికి 3266 మందిని పరీక్షించగా వారిలో 472 మందికి డయాలసిస్ అవసరం అని నిర్ధారణ అయిందని చెప్పారు. నేటికి 97.5 శాతం ప్రజలకు పరీక్షలు నిర్వహించామని, ఈ నెల 15కల్లా వంద శాతం స్క్రీనింగ్ పూర్తిచేస్తామని తెలిపారు. పలాస, సోంపేట, టెక్కలిలో మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కిడ్నీ వ్యాధుల కోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రికి చెప్పారు. 2014లో బెంచి మీద ఉన్న వైద్య ఆరోగ్యశాఖను నేడు బెంచ్ మార్క్ సాధించే స్థాయికి చేర్చగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షలో వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.