ఆంధ్రప్రదేశ్‌

మంత్రులు సరే.. అధికారుల మాటేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 9: మంత్రివర్గ ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల పనితీరుపై దృష్టి సారించకపోవడంపై సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పేషీలోనే ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే దానిని వైఫల్యంగా పట్టించుకోని బాబు, మంత్రుల పనితీరుపైనే దృష్టి సారించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని స్పష్టం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీలపై గత నాలుగు నెలల నుంచీ మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ఇక్కడ పనిచేయలేకపోతున్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. వీలైనంత త్వరగా వెళ్లిపోతే మంచిదన్న వ్యాఖ్యలు కొంతమంది అధికారుల నుంచి బహిరంగంగానే వినిపిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘మంత్రులకు స్వేచ్ఛలేదు. గత క్యాబినెట్‌లో కెఇ శాఖకి సంబంధించిన అధికారాలన్నీ లాగేసుకున్నారు. దానితో ఇక ఆయనకు అధికారుల్లో ఏం విలువ ఉంటుంది? పీతల సుజాత శాఖలో ఆమె మాట వినని అధికారులను నియమిస్తే ఆమె ఏం ప్రతిభ చూపిస్తుంది? అన్ని ఫైళ్లూ అధికారులే చూస్తే ఇక ఆమె వైఫల్యం ఎక్కడున్నట్లు? శిద్దా రాఘవరావు సొంతగా తీసుకున్న నిర్ణయాలేమున్నాయి? కీలక నిర్ణయాలన్నీ ఆయన గవర్నమెంటుకే వదిలేశారు కదా? మరి ఆయన శాఖ ఎందుకు మార్చారు? పల్లె రఘునాధరెడ్డి మాట విన్న అధికారులెవరో చెప్పండి? ఇవన్నీ బాబుగారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) లోనే వందల ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే, ఇక బాబు ఆశించిన పాలన ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఒక కీలక అధికారి సత్వర నిర్ణయాలు తీసుకోకుండా అన్నీ నాన్చుతారన్న విమర్శ సర్వత్రా ఉంది. శాఖపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, సరిపడా సిబ్బంది లేక గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన కొందరిని తీసుకుని ఇచ్చిన జీఓను రద్దు చేసిన సీఎంఓ, మళ్లీ దానిని ఇంతవరకూ సవరించి కొత్త ఉత్తర్వులివ్వడంలోనూ విఫలమయిందన్న విమర్శలున్నాయి. ‘ఎవరు ఎన్ననుకున్నా సీఎంఓ, సీఎస్, ఇంటలిజెన్స్ చీఫ్, డిజిపి, సమాచారశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అధికారంలో ఉన్న పార్టీ కోణంలోనే పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఒక పనిమీద రెండోసారి సీఎంఓ అధికారులను కలిసిన దాఖలాలు లేవు. జన్నత్‌హుస్సేన్‌ను ఇప్పటికీ చాలామంది గుర్తు పెట్టుకుంటారు. కొంతమంది అధికారులను మారుస్తారని నాలుగు నెలల నుంచీ ప్రచారం జరుగుతున్నా బాబు ఆ ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
ఒకే కంపెనీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎలా?
‘రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లపై చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఏజెన్సీ పెత్తనం నడుస్తోంది. ఇదే కంపెనీ కాంగ్రెస్ హయాంలో పదేళ్లూ హవా సాగించింది. ఇప్పుడు సీఎంఓ, విద్యాశాఖ సహా అన్ని శాఖల్లో కాంట్రాక్టులు దక్కించుకుంది. టెండర్లు లేకుండా నామినేషన్లపై పనులు సాధించుకుంది. తెలంగాణ కంపెనీలకు ఇవ్వకూడదని చెబుతున్నప్పటికీ, అసెంబ్లీ సహా అన్ని కీలక శాఖల్లోనూ తెలంగాణ అవుట్‌సోర్సింగ్ కంపెనీలే పనులు చేస్తున్నాయి. ఇవన్నీ మా వైఫల్యానికి, అధికారుల పెత్తనానికి నిదర్శనమ’ని మరో నాయకుడు వ్యాఖ్యానించారు.