ఆంధ్రప్రదేశ్‌

‘ఆ నలుగురు’ రాజీనామా చేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 9: పదవులకు రాజీనామా చేయకుండానే వైసీపీ నుంచి చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వ్యవహారంపై వస్తున్న విమర్శలకు అధికారిక వివరణ ఇచ్చే ప్రయత్నాలు జరగకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఆ నలుగురు రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారన్న లీకు వార్తలే తప్ప, అసెంబ్లీ కార్యాలయం గానీ, స్పీకర్ గానీ ఇప్పటివరకూ ధృవీకరించకపోవడంతో ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. అయితే ఆయన ప్రమాణస్వీకారానికి ముందు మీడియాను పిలిచి తాను తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖను స్పీకర్‌కు పంపుతున్నట్లు చెప్పి మీడియాకు విడుదల చేశారు. తలసాని రాసిన లేఖ అందిందని స్పీకర్ కార్యాలయం కూడా ప్రకటించింది. తలసాని రాజీనామా లేఖ ఇప్పటికీ స్పీకర్ పరిశీలనలోనే ఉంది. అయితే ఏపిలో కూడా అలాంటి సంప్రదాయం పాటించారా, లేదా? అన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉంచడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన భూమా అఖిలప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవులిచ్చి ఇప్పటికి వారం రోజులయింది. వారంతా బాధ్యతలు కూడా స్వీకరించారు. వారు మంత్రులుగా ప్రమాణం చేసే ముందు వైసీపీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారా, లేదా? అన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంచడం, వారంతా రాజీనామాలిచ్చారని కేవలం లీకుల ద్వారా ప్రచారం చేయడం విస్మయం కలిగిస్తోంది. ప్రమాణానికి ముందే ఆ నలుగురు స్పీకర్‌కు రాజీనామాలు పంపారని లీకు వార్తలొచ్చాయి. తాజాగా శనివారం విశాఖలో నిర్వహించిన మీడియా భేటీలో ఫిరాయింపుల అంశం ప్రస్తావనకు రాగా, అవన్నీ స్పీకర్ పరిధిలో ఉన్నాయని, ఆయనే చర్యలు తీసుకోవలసి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఫిరాయింపుదార్లకు పదవులివ్వడంపై వస్తున్న ఆరోపణలపై స్పందించని బాబు ఎట్టకేలకు మొహమాటాలకు తెరదించి వైఎస్ జగన్‌పై ఎదురుదాడి ప్రారంభించారు. కాగా, ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారా, లేదా? అన్న అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావును శనివారం రాత్రి వివరణ కోరగా.. ‘ఆఫీసుకు ఏవో వచ్చాయన్నారు. నేనింకా చూడలేదు. కనుక్కుంటా’నని చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలేమైనా అందాయా? అని ప్రశ్నించగా ఇప్పటివరకూ తనకైతే ఏమీరాలేదని వివరణ ఇచ్చారు. అయితే స్పీకర్ ఇచ్చిన వివరణను సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా ‘ఇక మరి వారిదే ఫైనల్ కదా’ అని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శిని గత సోమవారం కూడా ఇదే అంశంపై వివరణ కోరగా తనకెలాంటి రాజీనామా లేఖ అందలేదనే చెప్పటం ప్రస్తావనార్హం.
సహజంగా ఇంత కీలకమైన అంశంపై చర్చ, విమర్శలు వస్తున్నందున అసెంబ్లీ కార్యాలయమే వివరణ ఇవ్వాల్సి ఉంది. తరచూ మీడియా భేటీలు నిర్వహించే స్పీకర్ కూడా ఆ నలుగురి రాజీనామాలపై ఉన్న గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేయకపోవడం చర్చనీయాంశమయింది. వైసీపీ నుంచి వచ్చి మంత్రులయిన నలుగురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారా, లేదా? అన్నదానికి స్పష్టత ఇస్తే రాజకీయ వర్గాల నుంచి పార్టీపై ఇన్ని విమర్శలొచ్చేవి కావని, బాబుగారే ఫిరాయింపులపై మాట్లాడటం ప్రారంభించిన తర్వాత, ఇక దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని టిడిపి సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.