ఆంధ్రప్రదేశ్‌

స్వయం చోదక రోబోతో పారిశ్రామిక యంత్రాల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 10: పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాల దీర్ఘకాలిక మన్నికకు, కాలానుగుణంగా వాటిలో తలత్తె లోపాలను పర్యవేక్షించడానికి రిమోట్ కంట్రోల్‌తో సంబంధం లేకుండా స్వయం చోదకంగా సేవలందించే రోబోల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి వల్ల పారిశ్రామిక ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని యుకెకు చెందిన క్రాన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయం త్రూ లైఫ్ ఇంజనీరింగ్ సెంటర్ డైరెక్టర్, మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ రాయ్ వెల్లడించారు. గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, కండిషన్ మానిటరింగ్ సొసైటి ఆఫ్ ఇండియా (సిఎమ్‌ఎస్‌ఐ) సంయుక్తంగా సోమవారం ఏర్పాటు చేసిన డాక్టర్ వి.్భజంగరావు ధార్మికోపన్యాస కార్యక్రమంలో ప్రొఫెసర్ రాయ్ ప్రధానవక్తగా మాట్లాడుతూ పరిశ్రమలు, విమానాలు, రైళ్ళు, నౌకల తయారీకి వాడే యంత్రాలను వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయన్నారు. అలాగే అవసరమైనపుడు విడి భాగాలను సరఫరా చేయడం, స్వల్పకాలిక సర్వీసింగ్ వంటివి చేపడుతున్నాయని, అయి తే కాలునుగుణంగా ఈ సేవల్లో మార్పు వస్తోందని, అందుకనే వాటి జీవిత కాలం పనితీరును పరిశీలించే లైఫ్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు డిమాండ్ పెరుగుతోందన్నారు. దూర ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమల్లోని యంత్రాల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి రిమోట్ మెయింటినెన్స్ పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పరిశ్రమల యంత్రాలను ఎప్పటికపుడు సమర్ధంగా పని చేయించడానికి వాటి పనితీరును సమీక్షించడానికి బిగ్ డేటా, డేటా అనలైటిక్స్ ఉపయోగపడుతున్నాయన్నారు. భద్రత విషయంలో సైబర్ సెక్యూరిటీని సైతం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.