ఆంధ్రప్రదేశ్‌

టికెట్ ఇస్తారా...లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 10: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు మాజీమంత్రి శిల్పా వర్గీయులు సోమవారం రహస్య సమావేశం నిర్వహించి పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీచేసినట్లు సమాచారం. టిడిపి టికెట్ శిల్పా మోహన్‌రెడ్డికే ఇవ్వాలని, లేదంటే తమదారి తాము చూసుకుంటామని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఒకవేళ పార్టీ టికెట్ రాకుం టే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచి సత్తా చాటుదామని అన్నట్లు తెలుస్తోంది. శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం తన వర్గీయులతో ఇంట్లో రహస్య సమావేశం నిర్వహించారు. సమావేశం అజెండా బయటకు పొక్కకుండా మీడియాను దూరంగా ఉంచారు. సమావేశానికి శిల్పా వర్గీయులుగా ముద్రపడ్డ మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సులోచన, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలకు చెందిన అనుచరులు హాజరయ్యారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని మాజీ మంత్రి శిల్పాను వారంతా కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై శిల్పా ఎలాం టి వ్యాఖ్యలు చేయలేదని సమాచారం. అధిష్టానం నిర్ణయం కోసం వేచిచూద్దామని తన అనుచరులతో అన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి గత రెండు రోజులుగా నంద్యాలలో తిష్టవేసి రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ తన వర్గీయులతో మంతనాలు సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను నిలిపినట్లు ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. భూమా టిడిపిలో చేరినా అధిష్టానం ఆదేశాల మేరకు కలిపి పనిచేశామని, ఇప్పుడు ఆ సీటు ఖాళీ అయినందున తమ నేతకే కేటాయించాలని శిల్పా వర్గీయులు పట్టుపడుతున్నారు.
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా కుటుంబ సభ్యులను బరిలో నిలుపుతారా, లేక మరెవరినైనా రంగంలోకి దింపుతారా అన్న చర్చ తీవ్రమైంది. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి వర్గీయులు ఆయన అల్లుడు శ్రీ్ధర్‌రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టిడిపి టిక్కెట్ కావాలని కోరుతూ సోమవారం అమరావతికి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. వర్గపోరులో భూమా, శిల్పా వర్గీయులు టికెట్ కోసం పోటీపడుతుండగా సందట్లో సడేమియా అన్న చందంగా మాజీ మంత్రి ఫరూక్ వర్గీయులు టికెట్ తమ నాయకునికే ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.

చిత్రం..నంద్యాలలో తన వర్గీయులతో శిల్పా మోహన్‌రెడ్డి