ఆంధ్రప్రదేశ్‌

జీవనోపాధి కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 10: విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఎనిమిదేళ్లు న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన పిడతల సత్యంబాబు నేడు జీవన పోరాటం సాగిస్తున్నాడు. ఈ నెల 2న జైలు నుండి బయటికొచ్చిన సత్యంబాబు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాడు. ‘చేయని నేరానికి నన్ను ఎనిమిదేళ్లు జైలులో బందీని చేశారు. నా కుటుంబం దిక్కులేనిదయింది. ఆర్థికంగా ఛిన్నాభిన్నమైంది.
నా తండ్రి మానసిక వేదనతో మృతి చెందాడు. తల్లి కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. అప్పోసొప్పో చేసి నర్సింగ్ చదువు పూర్తిచేసిన నా చెల్లి ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ కొంతలో కొంత తల్లికి ఆసరాగా నిలిచింది. ఏడాది క్రితమే ఉన్న చిన్నపాటి పూరిగుడిసె కూడా ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైంది. దీంతో నా కుటుంబం నిలువనీడ కోల్పోయింది. నేను జైలు నుండి వచ్చాక కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయాను. ఊరూవాడా నాకు అండగా నిలిచినా, వారి నుండి సానుభూతేతప్ప మరేమీ పొందలేకపోయాను. ఈనేపథ్యంలో ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలి’ అని సత్యంబాబు వేడుకుంటున్నాడు. సోమవారం దళిత సంఘాల మద్దతుతో ఇక్కడ కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎను కలిసి జీవనోపాధి కల్పించాలని వినతిపత్రం అందజేశాడు. జైలులో ఉన్న రోజుల్లోనే పట్టుదలతో ఓపెన్ వర్శిటీలో పట్ట్భద్రుడినయ్యానని, దీన్ని ఆధారంగా చేసుకుని తనకు, ప్రైవేట్ వైద్యశాలలో నర్సింగ్ ఉద్యోగం చేస్తున్న తన చెల్లెలికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. తన తల్లికి జీవనాధారం కోసం కొంత వ్యవసాయ భూమి ఇవ్వాలని కోరాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాబు.ఎ తన పరిధిలో తప్పక న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇప్పిస్తామని, త్వరలో జరిగే ఎఎన్‌ఎం పోస్టుల భర్తీలో తొలి ప్రాధాన్యత సత్యంబాబు చెల్లెలికి ఇస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇంటి స్థానంలో పక్కాగృహం నిర్మిస్తామన్నారు. ఆర్థిక సాయం, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం విషయమై ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. దీనిపై సత్యంబాబు హర్షం వ్యక్తం చేశాడు. అయితే త్వరలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పాడు. ప్రభుత్వ సాయాన్ని కోరనున్నట్లు సత్యంబాబు తరఫున వచ్చిన కొందరు దళిత సంఘాల ప్రతినిధులు విలేఖరులకు తెలిపారు.

చిత్రం..జీవనోపాధి కల్పించాలంటూ కలెక్టర్ బాబు.ఎను కలిసిన సత్యంబాబు, తల్లి మరియమ్మ