ఆంధ్రప్రదేశ్‌

జీఎస్టీకి దేశవ్యాప్తంగా సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను (జిఎస్టీ) విధానం పట్ల దేశవ్యాప్తంగా అనుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గత ఏడాది 1.71 లక్షల కోట్ల మేర వ్యయం చేసినట్లు తెలిపారు. వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అనంతరం సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీలో నాలుగు రకాల వస్తువులు- పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, సాఫ్ట్ డ్రింక్స్, బొగ్గు (క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్)పై 28శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన వాటిపై 5శాతం, 12శాతం, 18శాతం చొప్పున పన్ను విధించే అవకాశం ఉందని చెప్పారు. కొత్త పన్నులకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ (సిజిఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ), పరిహార బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించారన్నారు. వాటిని రాష్టప్రతి ఆమోదానికి పంపారని, ఆమోదించిన తరువాత గజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. తరువాత రాష్ట్రాలు ఆమోదించవలసి ఉంటుందని చెప్పారు. ఈ బిల్లుల ఆమోదించడం కోసం ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటివారంలో గానీ రాష్ట్రంలో ఉభయ సభల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈలోపు పూర్తిగా పన్ను నుంచి మినహాయించాల్సిన వస్తువుల వివరాలను అధ్యయనం చేసి నిపుణుల కమిటీ ఒక నివేదిక అందజేస్తుందని తెలిపారు. అయితే ఈ కమిటీలో మన రాష్ట్రం నుంచి సభ్యుడెవరూ లేరని చెప్పారు. వ్యాట్ కింద మినహాయింపు ఇచ్చిన వస్తువులకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 18, 19తేదీల్లో శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు. ఏఏ వస్తువులపై ఎంత పన్ను విధించాలి, నష్టపోయే రాష్ట్రాలను ఏవిధంగా ఆదుకోవాలి వంటి అన్ని విషయాలను సమావేశంలో చర్చిస్తారన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన తరువాత దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమలుచేసే అవకాశం ఉందని చెప్పారు. జిఎస్టీ వల్ల రాష్ట్రానికి తొలి సంవత్సరం 2000 కోట్ల రూపాయల వరకూ నష్టం వచ్చే అవకాశం ఉందన్నారు. విదేశాలకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు వెళ్లిన సందర్భాల్లో దేశంలో పన్నుల వ్యవస్థపై విమర్శలు వచ్చేవని గుర్తుచేశారు. దీనివల్ల దేశమంతటా ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుందని, పెట్టుబడులు మరింతగా వచ్చే అవకాశం ఉంటుందని యనమల తెలిపారు. ఒకే రకమైన పన్నుల విధానాన్ని ప్రపంచంలో సగం దేశాలు ముఖ్యంగా యూరప్‌లో అమలు చేస్తున్నట్లు వివరించారు. దీర్ఘకాలంలో రెవెన్యూ పెరుగుతుందని, స్వల్పకాలంలో నష్టాలు వస్తాయని చెప్పారు. అయితే నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం సెస్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తుందని యనమల తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 1.35 లక్షల కొట్ల రూపాయలతో వ్యయం అంచనా వేయగా, ప్రొవిజనల్ ఎక్కౌంట్స్ ప్రకారం 1.71 లక్షల కోట్ల రూపాయలు వ్యయం అయిందని తెలిపారు. ఆదాయం కూడా 1.66 లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు. అంచనాలకు మించి పెరిగిన ఖర్చుల వల్ల ఎఫ్‌ఆర్‌ఎంబి ప్రామాణికాలు మారాయన్నారు. రెవెన్యూ లోటు 0 శాతం ఉండాల్సి ఉండగా, అది 1.63 శాతానికి, ఆర్థిక లోటు 3 శాతం ఉండాల్సి ఉండగా, అది 3.64 శాతానికి చేరిందన్నారు. జిడిపిలో రుణాల శాతం 25 శాతం ఉండాలని, కాని 27 శాతానికి చేరిందన్నారు. గ్యారంటీలకు సంబంధించి పరిమితిలోనే ఉన్నామన్నారు. ఖర్చు పెరగడం వల్ల దాదాపు 28 వేల రూపాయల మేర సప్లిమెంటరీ బడ్జెట్‌కు ఆమోదం తీసుకున్నామన్నారు. రెవెన్యూ, ఆర్థిక లోటును నియంత్రించాల్సి ఉందన్నారు. గతంలో కాగ్ నివేదికలో దాదాపు 13వేల కోట్ల రూపాయలు అధికారుల వ్యక్తిగత ఖాతాల్లో ఉన్నట్లు గుర్తించిందని తెలిపారు. ఈ ఏడాది కూడా కాగ్ దాన్ని గుర్తు చేసిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ఖజనాకు బదలాయించేలా చర్యలు చేపట్టామని, అది జరిగితే రెవెన్యూ లోటు ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని శాఖలు జమ చేశాయని, మరికొన్ని చేయాల్సి ఉందని మంత్రి యనమల వివరించారు. సమావేశంలో మంత్రి నారాయణ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, తదితరులు పాల్గొన్నారు.