ఆంధ్రప్రదేశ్‌

బోధనానుభవం లేని టీచర్ల ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా విభాగం ద్వారా విద్యార్హత ఉండి బోధనానుభవం లేనివారికి సీనియర్ అధ్యాపకులతో హైదరాబాద్ గండిపేట్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన 25 మంది ఉపాధ్యాయినులు, 25 మంది ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో శిక్షణనిచ్చి వారికి ఎన్టీఆర్ విద్యాసంస్థలు సహా వివిధ విద్యాసంస్థల్లో ఉద్యోగం సంపాదించుకోడానికి సహాయ సహకారాలు అందిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా బ్రాహ్మణి ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం బోధనా అనుభవం లేని కారణంగా ఉద్యోగం పొందలేని ప్రతిభావంతులైన, అర్హులైన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ద్వారా మంచి సంస్థల్లో ఉపాధి లభిస్తుందన్నారు. ఇంగ్లీషు మీడియంలో బోధించడానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20లోపు ఈ-మెయిల్ ద్వారా తమ బయోడేటాలు పంపాలని ఆమె సూచించారు.