ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డీలర్లకు కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: ప్రతినెలా రాష్ట్రంలో కోటీ 30 లక్షల మంది కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న 13 జిల్లాలకు చెందిన 30వేల మంది డీలర్ల కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కోరింది. ఈమేరకు మంగళవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రతా చట్టం కింద 2015 డిసెంబర్ నుంచి బియ్యం, గోధుమలు క్వింటాల్‌కు రూ.87లు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ నుంచి మాత్రమే రూ.20ల నుంచి రూ.70లకు పెంచి చెల్లిస్తోందని తెలిపారు. ఈ-పోస్ ద్వారా పంపిణీ చేసిన ప్రతి కార్డుకు రూ.5లు చొప్పున అదనంగా వినియోగ చార్జీల కింద చెల్లిస్తామన్న హామీ కూడా నెరవేర్చాలన్నారు. 2015 డిసెంబర్ నుంచి రూ.87లు చొప్పున చెల్లించాలని కోరారు. ఈవిధంగా 2017 ఏప్రిల్ వరకు అంటే 17 మాసాలకు అంగన్‌వాడీ కేంద్రాలకు అందించిన సరుకులపై డీలర్లకు కమీషన్ రూపేణా రూ.16 కోట్ల 66 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద మరో 7కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇటీవల విడుదలైన జీవో నెం.20 ప్రకారం ప్రతి రేషన్ దుకాణాన్ని మినీ మీ సేవ కేంద్రంగా మార్చి డీలర్లను బ్యాంక్ ప్రతినిధులుగా గుర్తించాలని, గిరిజన ఉత్పత్తులను కూడా అందించి డిపోలను మినీ సూపర్‌బజార్లుగా మార్చాలని కోరారు. ఈ పథకాల అమలు కోసం ముద్రా బ్యాంక్ ద్వారా రూ.2లక్షల చొప్పున రుణం ఇప్పించాలని, హెల్త్‌కార్డులు అందించాలని మాధవరావు కోరారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నుంచి గత 20ఏళ్లుగా పనికి ఆహార పథకం, బియ్యం కమీషన్, మధ్యాహ్న భోజన పథకం కమీషన్ దాదాపు రూ.20 కోట్లుపైగా బకాయిలు రావాల్సి ఉన్నందున తక్షణం ఇప్పించాలని కోరారు. ధరావతు సొమ్ముతో డీలర్ల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ఏటా వచ్చే 2కోట్ల రూపాయల వడ్డీతో గ్రూప్ ఇన్స్యూరెన్స్ అమలుచేయాలని, చనిపోయిన డీలర్ల కుటుంబాలకు లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ప్రతినిధి బృందంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్లు పి చిట్టిరాజు, గంగాధరగౌడ్, వెంకటేశ్వరరావు, నరసింహారావు, బ్రహ్మారెడ్డి, బ్రహ్మనాయుడు, అప్పారావు, 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.