ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో శరవేగంగా భవన నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: రాజధాని అమరావతి ప్రాంతంలో భవన నిర్మాణాలు ఇక జోరందుకోనున్నాయి. సిఆర్‌డిఏ ఆంక్షల కారణంగా చాలాకాలంగా లేఅవుట్లు, భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు వెలుపల 500 చ.మీలు పైబడిన విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లను కొన్ని నిబంధనల మేరకు అనుమతించనున్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు పి నారాయణ, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ మంగళవారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆ వివరాలను మంత్రులు రామకృష్ణుడు, నారాయణ విలేఖరులకు వివరించారు. ఇప్పటివరకు 500 చ.మీల లోపు లేఅవుట్లకు సిఆర్‌డిఏ అనుమతులు మంజూరు చేస్తోంది. లేఅవుట్‌కు సంబంధించిన వీధిదీపాలు, మురుగు కాలువలు, రోడ్లు, తదితర వౌలిక సదుపాయాలకు సిఆర్‌డిఏ బాధ్యత వహిస్తోంది. ఇందుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ఆ లేఅవుట్ అభివృద్ధి చేసిన వారి నుంచి వసూలు చేస్తోంది. 500 చ.మీలు మించిన లేఅవుట్లకు మాత్రం ఇప్పటివరకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో ఇన్నర్ రింగురోడ్డు వెలుపల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరగని పరిస్థితి నెలకొంది. 1255 ఎకరాల్లో 99 లేఅవుట్లు కొంతకాలంగా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. చాలాకాలంగా ప్రభుత్వంపై ఈవిషయమై ఒత్తిడి వస్తుండటంతో మంత్రుల బృందం మంగళవారం భేటీ అయింది. ఆ లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా మంత్రివర్గానికి సిఫారసు చేశారు. వీటిలో వౌలిక సదుపాయాలను ఆయా లేఅవుట్ల అభివృద్ధిదారులే కల్పించాల్సి ఉంటుంది. లేఅవుట్ల మంజూరు నిలిపివేత రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఆదాయం పడిపోవటమే గాక ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు కూడా ప్రభావితం కావడాన్ని ప్రభుత్వం గమనించింది. దీంతో ఈప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర ఖజానాకు మేలుచేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అన్ని పట్ణణాభివృద్ధి సంస్థల పరిధిలో ఒకేవిధమైన నిబంధనలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని యనమల, నారాయణ వివరించారు.