ఆంధ్రప్రదేశ్‌

ఏపి మార్కెటింగ్ ఫెడరేషన్ విభజన చట్టబద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజన సరైన చర్యని, చట్టబద్ధమని, తెలంగాణ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు ఆ రాష్ట్రప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జిని నియమించే అధికారం ఉందని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఏపి మార్కెటిగ్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజనను సవాలు చేస్తూ కొంత మంది డైరెక్టర్లు 2014 మే నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన 2014 మార్చిలో జరిగిందని, ఈ నేపథ్యంలో ఏపి మార్కెటింగ్ ఫెడరేషన్‌ను మే నెలలో విభజించడం సరైన చర్య కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లు 2014కు మార్చి నెలలో రాష్టప్రతి ఆమోదం తెలిపినా, రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. చట్టబద్ధంగానే ఈ సమాఖ్య విభజన జరిగిందని, చట్టానికి లోబడి తెలంగాణ ప్రభుత్వం సమాఖ్యకు పర్సన్ ఇన్‌చార్జిని నియమించిందని హైకోర్టు పేర్కొంది. ఈ సమాఖ్యకు ఎన్నికైన డైరెక్టర్లు తమ పదవీ కాలం ఐదేళ్లని, కాలపరిమితి పూర్తయ్యే వరకు తమను డైరెక్టర్లుగా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పై మేరకు ఆదేశాలు జారీ చేసింది.