ఆంధ్రప్రదేశ్‌

నార్మన్ ఫోస్టర్ డిజైన్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: మూడురోజుల లండన్ పర్యటనలో రెండోరోజు మంత్రి నారాయణ బృందం బిజీబిజీగా గడిపింది. నార్మన్ ఫోస్టర్ డిజైన్లను పరిశీలించిన బృందం తగిన సూచనలు చేసింది. అనంతరం లండన్ నగరంలో అక్కడి అధికారులు పట్టణాభివృద్ధిలో అనుసరిస్తున్న వివిధ పద్ధతులను పరిశీలించిన నారాయణ అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్మన్ ఫోస్టర్ బృందం 900 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ భవన సముదాయాలకు డిజైన్లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో వారు ముఖ్యమంత్రిని కలిసి సమర్పించిన డిజైన్లలో చంద్రబాబు నాయుడు స్వల్ప మార్పులు సూచించారు. వాటి పురోగతిని పరిశీలించడానికి లండన్ వెళ్లిన మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం నార్మన్ ఫోస్టర్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ బృందం శుక్రవారం పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటుంది. ఈ బృందంలో పురపాలక మంత్రి నారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, అదనపు కమిషనర్ మల్లిఖార్జున్ కూడా ఉన్నారు.