ఆంధ్రప్రదేశ్‌

సొంతింటి కల సాకారం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 13: రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం అనంతపురంలోని డ్వామా సమావేశ మందిరంలో గృహ నిర్మాణాల ప్రగతిపై క్షేత్ర స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గూడులేని నిరుపేదలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఇళ్లు నిర్మించేందుకు సిఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతోందన్నారు. రెండేళ్ల కాలంలో పూర్తిచేయాలని దృఢసంకల్పంతో ఉందన్నారు. ఇప్పటి వరకు అసంపూర్తిగా మిగిలిపోయిన 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. మరో 2 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, కొత్తగా మరో 4 లక్షల ఇళ్లు 2019 నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా గృహ నిర్మాణంలో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుందన్నారు.