ఆంధ్రప్రదేశ్‌

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 13: కులం పేరుతో నిత్యం దూషించడం, విధులు సక్రమంగా చేయడం లేదంటూ వేధించడం వంటి కారణాలతో ఒక గిరిజన మహిళా కానిస్టేబుల్ తన క్వార్టర్‌లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. విజయనగరం జిల్లా గజపతినగరం సర్కిల్ పరిధిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. సర్కిల్ పరిధిలోని ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్‌లో పాచిపెంట మండలం కోడితాళ్లవలస గ్రామానికి చెందిన బట్నాన శశి కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. భర్త శశిభూషణరావుతో కలసి స్టేషన్ పక్కనే గల పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉంటోంది. బూర్జివలస ఎస్సై రమేష్‌నాయుడు తరచూ కులం పేరుతో దూషించడం, పని ఎంత బాగా చేస్తున్నా ఏదో ఒక సాకుతో వేధిస్తున్నాడని లేఖ రాసి గురువారం క్వార్టర్‌లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన భర్త శశిభూషణరావు గజపతినగరంలోని ఒకప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన చికిత్స కోసం తరలించారు. ఎస్సై రమేష్‌నాయుడు తరచూ వేధింపులకు పాల్పడడం, చనిపోమని పదేపదే అనేనేవాడని, ఈ విషయమై ఎస్పీకి, డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు.