ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ రుసుముల పెంపు పరిశ్రమలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 13: విద్యుత్ స్థిర రుసుము (్ఫక్స్‌డ్ ఛార్జీలు) పెంపువల్ల పారిశ్రామిక రంగానికి తీవ్ర విఘా తం ఏర్పడుతుందని పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బివి రామారావు హెచ్చరించారు. పారిశ్రామికవేత్తలు ఎంత మొత్తుకుంటున్నా ఖాతరు చేయకుండా ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఫిక్స్‌డ్ ఛార్జీల కారణంగా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ విధానంతో పారిశ్రామిక వేత్తలు బ్యాంకు రుణాలను చెల్లించలేని దుస్థితి వాటిల్లుతుందన్నారు. వేలాది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు చిన్న పరిశ్రమలను స్థాపించి ప్రపంచంలో అగ్రగామిగా అవతరించాయన్నారు. ఆయా దేశాల్లో మహా నగరాల నుండి గ్రామాల వరకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులు సమకూర్చుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా పారిశ్రామిక రంగానికి అన్ని విధాలుగా తోడ్పాటునందించాలని కోరారు. నిరుద్యోగులను ప్రోత్సహించడానికి సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
ముద్ర పథకం ద్వారా 50వేల నుండి 10 లక్షల వరకు ఏ విధమైన హామీ లేకుండా 49 బ్యాంకుల నుండి రుణ సహా యం పొందే అవకాశం ఉందని, ఈ పథకాన్ని రాష్ట్రంలో విజయవంతం గా అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించాలనుకున్న యువత బ్యాం కులకు వెళ్ళి ముద్ర రుణాలను కోరిన వెంటనే ఆయా బ్యాంకర్లు సకాలంలో స్పందించి, తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైన బ్యాంక్ అధికారులు తగిన ష్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వలేమని చెప్పిన పక్షంలో వారిని లిఖితపూర్వకంగా ఇవ్వమని డిమాండ్ చేయాలని, సదరు బాధితులకు న్యాయం చేసేందుకు పరిశ్రమల సమాఖ్య కృషి చేస్తుందని చెప్పారు. ఫైనాన్షియర్లు, రోజూవారీ రుణాలు ఇచ్చేవారి నుండి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కాపాడాలంటే ముద్ర వంటి రుణాలను అందించి ఆదుకోవడం ద్వారా అది సాధ్యమవుతుందని రామారావు పేర్కొన్నారు.